Site icon NTV Telugu

Minister Narayana: 12 టవర్లలో 288 అపార్టుమెంట్లు.. అమరావతిలో నిర్మాణ పనులు వేగవంతం

Narayana

Narayana

Minister Narayana: అమరావతి రాజధాని అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ తాజా సమీక్ష నిర్వహించి కీలక ప్రకటనలు చేశారు. నగర నిర్మాణంలో భాగంగా ఇప్పటికే అనేక నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రుల నివాసాలతో పాటు అధికారుల నివాసాల నిర్మాణంపై స్పష్టత ఇచ్చారు. ఇందులో భాగంగా.. రాజధాని ప్రాజెక్టులో కీలకమైన ట్రంక్ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం ముందడుగు వేసింది. మొత్తం 360 కిలోమీటర్ల రహదారులకు టెండర్లు పిలవడం జరిగిందని మంత్రి వెల్లడించారు.

Read Also:Vivo Y50m 5G, Y50 5G: కేవలం రూ.13,000ల ప్రారంభ ధరకే ఇన్ని ఫీచర్లున్న ఫోన్ ఏంటి భయ్యా.. గ్లోబల్ గా విడుదలైన కొత్త వివో మొబైల్స్..!

అలాగే ఎమ్మెల్యేలు, మంత్రుల బంగళాలను పరిశీలించినట్లు నారాయణ తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 12 టవర్లు, మొత్తం 288 అపార్టుమెంట్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఆలిండియా సర్వీసు అధికారులకు 6 టవర్ల నిర్మాణం జరుగుతుండగా, గ్రౌండ్ ఫ్లోర్ దాదాపు పూర్తయిందన్నారు. ఇంకా నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాల టవర్లు కూడా నిర్మాణాంతర దశలో ఉన్నాయని తెలిపారు. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో 6 టవర్లు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ వచ్చే మార్చి 31 లోపు పూర్తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు.

అయితే, ఆలిండియా సర్వీసు అధికారుల కోసం నిర్మిస్తున్న టవర్లను ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించామని మంత్రి వెల్లడించారు. అలాగే ఐకానిక్ టవర్ డిజైన్‌లు పూర్తయ్యాయి. నార్మన్ ఫోస్టర్ బృందం ఇవాళ అమరావతికి రానున్నదని, వారితో డిజైన్‌పై చర్చలు జరుగుతాయని తెలిపారు. 75 ప్రైవేట్ కంపెనీలకు భూకేటాయింపు పూర్తయిందని చెప్పారు. డిసెంబర్ ఎండింగ్ నాటికి కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభిస్తాయని తెలిపారు.

Arjun : 8 ఏళ్ల తర్వాత హీరోగా అర్జున్ సర్జా రీ ఎంట్రీ !

గత ప్రభుత్వ హయాంలో రైతులు, కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడ్డారని మంత్రి విమర్శించారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌పై ఎలాంటి అభ్యంతరాలు రావడం లేదని పేర్కొన్నారు. ఇక సబ్‌కమిటీ చర్చల అనంతరం క్యాబినెట్‌లో ల్యాండ్ పూలింగ్ అంశాన్ని తీసుకువస్తామని తెలిపారు. ముఖ్యంగా అమరావతిలో లీగల్ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ అన్నీ పరిష్కారమయ్యాయి అని మంత్రి స్పష్టం చేశారు.

Exit mobile version