NTV Telugu Site icon

Nara Lokesh: నాపై నమ్మకంతో కీలక శాఖలు కేటాయించిన సీఎంకు కృతజ్ఞతలు.. ఎక్కడ ఆపానో అక్కడి నుండే స్టార్ట్..

Lokesh

Lokesh

Nara Lokesh: నాపై నమ్మకం ఉంచి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్‌టీజీ శాఖలు కేటాయించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు ఏపీ మంత్రి నారా లోకేష్‌.. అయితే, తాను మంత్రిగా 2019లో పనిని ఎక్కడ ఆపానో.. అక్కడి నుండే తిరిగి ప్రారంభిస్తాను అన్నారు.. వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకుంటా.. ఈసారి, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల కల్పనలో ఇతర రాష్ట్రాలకు తీవ్రమైన పోటీ ఇస్తుందన్నారు. ఐటీ ఎలక్ట్రానిక్ కంపెనీలను ఆకర్షించడానికి, రాష్ట్రం నుంచి వలస వెళ్లాల్సి వచ్చిన మన యువతకు ఉద్యోగాలు కల్పించడానికి నేను 2019లో వదిలిపెట్టిన చోటు నుండే పనిని తిరిగి పునః ప్రారంభిస్తాను.. నాపై నమ్మకం ఉంచి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్‌టీజీ శాఖలు కేటాయించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు లోకేష్‌.

Read Also: Italy G7 Summit: పోప్ ఫ్రాన్సిస్‌-మోడీ ఆత్మీయ ఆలింగనం.. వీడియో వైరల్

ఇక, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా చేసిన నా గత అనుభవం ఇప్పుడు జీవనోపాధి విద్యను రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను అని పేర్కొన్నారు మంత్రి లోకేష్‌.. మన యువతకు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల్లో ఉద్యోగాలు నైపుణ్యం కల్పించడానికి నా తాజా ప్రయాణాన్ని ప్రారంభిస్తా.. నాడు పల్లె సేవే పరమాత్ముడి సేవ అని భావించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాల రూపురేఖలు మార్చాను. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా అనేక కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాను. గత అనుభవం నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరింత సమర్ధవంతంగా పని చేస్తాను. యువగళం పాదయాత్రలో కేజీ నుండి పీజీ వరకూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానని హామీ ఇచ్చాను. స్టాన్‌ఫోర్డ్ లో చదువుకున్న నాకు గ్రామీణ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే అవకాశాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నాను. రాష్ట్రానికి ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తెచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తాను అని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు మంత్రి నారా లోకేష్‌..

Show comments