అభివృద్ది వికేంద్రీకరణకు కట్టుబడి పలు ప్రాంతాల్లో యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నామని, అమరావతికి వచ్చేందుకు బిట్స్ సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రభుత్వ వర్సిటీల్లో పరిపాలనకు యూనిఫైడ్ చట్టం తీసుకొస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన యాక్టును మొత్తం పరిశీలన చేసి మార్పులు, చేర్పులు చేస్తామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుపై శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి లోకేశ్ సమాధానం ఇచ్చారు.
‘అభివృద్ది వికేంద్రీకరణకు కట్టుబడి పలు ప్రాంతాల్లో యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తాం. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నాం. అమరావతికి వచ్చేందుకు బిట్స్ సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన యాక్టు వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయి. మన చట్టాలు ప్రైవేట్ రంగంలో విశ్వ విద్యాలయాలు రాకుండా చేశాయి. యూజీసీ నిబంధనలకు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రస్తుతం అన్నీ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాం.యాక్టు మొత్తం పరిశీలన చేసి మార్పులు, చేర్పులు చేస్తాం. మాదక ద్రవ్యాల నివారణకు చైతన్యం తీసుకువస్తున్నాం. గంజాయి పంటను ఇతర పంటలతో కలిపి సాగు చేస్తున్నారు. అవి కూడా డ్రోన్స్ సాయంతో గుర్తించి అరికడతాం’ అని మంత్రి నారా లోకేశ్ చెప్పారు.