NTV Telugu Site icon

AP Assembly Budget Sessions: మెగా డీఎస్సీల ద్వారా త్వరలో 16,347 పోస్టుల భర్తీ: మంత్రి లోకేశ్‌

Nara Lokesh

Nara Lokesh

ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. అనంతరం 2025-26 బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. వివిధ కేటాయింపులు, సంక్షేమానికి నిధులు తదితర అంశాలపై సభలో చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాల నేపథ్యంలో స్కూళ్లలో ప్రహారీ నిర్మాణం, డీఎస్సీపై అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్‌ సమాధానం ఇచ్చారు. మెగా డీఎస్సీల ద్వారా త్వరలో 16,347 పోస్టుల భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో ప్రహారీల నిర్మాణానికి రూ.3వేల కోట్లు అవసరం అవుతుందన్నారు. అన్ని కాలేజీలు, స్కూళ్లలో ‘ఈగల్‌’ బృందాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు.

‘రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల ప్రహరీ గోడను పూర్తిచేయాలంటే 3వేల కోట్లు అవుతుంది. మనబడి-మనభవిష్యత్తు, ఉపాధి హమీ కింద దశల వారీ చేపడుతాం. డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్‌ను ఈ ప్రభుత్వం చేపట్టింది. ప్రతి పాఠశాలలో ఈగల్ టీంలు ఏర్పాటు చేస్తున్నాం. అన్ని కాలేజీలకు, పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నాం. పేరెంట్ టీచర్ మీటింగ్లో స్టార్ రేటింగ్ ఆధారంగా మౌళిక సధుపాయాలు, మంచి విద్య అందించడంలో ప్రణాళికలు వేస్తున్నాం. సాయత్రం సభ్యులతో ఓ సమావేశం పెట్టి 117 జీవోతో నిరుపేదలకు విద్యను దూరం చేశారు. గత ప్రభుత్వ నిర్వాకంతో 12 లక్షల మంది విద్యార్ధులు తగ్గిపోయారు. దీనికి ఓ ప్రత్యమ్నాయంపై సభ్యులతో చర్చించాలని నిర్ణయించాం. మధ్యాహ్నం ఓ సమావేశం ఏర్పాటు చేయనున్నాం. ఇన్ కంప్లీట్ గా ఉన్న పనులన్ని పూర్తిచేస్తాం. 117 జీవోకు ప్రత్యమ్నాయంగా తీసుకువచ్చే జీవో ఆధారంగా సభ్యుల సలహలతో ముందుకు వెళతాం. నాడు నేడుపై ఆరోపణలు వచ్చాయి, నాణ్యత లేదన్నారు. దీనిపై రిపోర్టు తీసుకుని యాక్షన్ తీసుకుంటాం’ అని మంత్రి లోకేశ్‌ చెప్పారు.

‘రంపచోడవరం నియోజకవర్గంలో 80 పాఠశాలల్లో మౌళిక సధుపాయాలకు శాంక్షన్ చేస్తున్నాం. సీసీ టివీలు, లైటింగ్ పాఠశాలల వద్ద ఏర్పాటు చేస్తాం. లెర్నింగ్ ఎక్స్ లెన్స్ ఆఫ్ ఏపీ కింద సీఎస్ఆర్ నిధులు తెచ్చి అభివృద్ది చేయాలి. డిప్యూటీ సీఎం ఎలా అయితే సీఎస్ఆర్ ద్వారా అభివృద్ది చేస్తున్నారో అలా మనం కూడా చేద్దాం. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి ప్రకటన విడుదల చేస్తాము’ అని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో నాల్గవ ప్రశ్న వైసీపీ సభ్యులు అడిగారు. వారికి సమాధానం ఇస్తాను అని డిప్యూటీ స్పీకర్ ను మంత్రి లోకేష్‌ అభ్యర్థించారు. టీవీలో అయినా సభ్యులు సమాధానం చూసుకుంటారని డిప్యూటీ స్పీకర్ పేర్కొన్నారు.