NTV Telugu Site icon

Minister Nara Lokesh: ప్రజలకు సేవ చేస్తే భగవంతుడుకి చేసినట్టే.. అదే బాటలో సేవ చేస్తా..

Lokesh Nara

Lokesh Nara

Minister Nara Lokesh: ప్రజలకు సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లేనని.. తన తాత ఎన్టీ రామారావు, తండ్రి చంద్రబాబు నాయుడు, తల్లి భువనేశ్వరి తనకు చిన్నప్పుడు నుంచి నేర్పించారని, అదే బాటలో తాను ప్రజాసేవనే దైవ సేవగా భావిస్తున్నానని అన్నారు మంత్రి నారా లోకేష్‌.. మంగళగిరి ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్రను శాస్త్రోత్తంగా పూజలు చేసి ప్రారంభించిన మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్.. బంగారు చీపురుతో వీధులను శుభ్రం చేస్తూ స్వామివారికి స్వాగతం పలికారు. అశేష భక్తజన సమూహం హాజరుకాగా.. ఇస్కాన్ టెంపుల్ పురవీధులలో స్వామివారిని ఊరేగించారు. మొదటగా పూజ నిర్వహించిన నారా లోకేష్.. జగన్నాథ స్వామికి పూజలు నిర్వహించి రథ యాత్రను ప్రారంభించారు.

Read Also: Anant ambani wedding: అనంత్-రాధిక పెళ్లికి హాజరుకానున్న ప్రధాని మోడీ!

ఇక, ఆ తర్వాత భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్‌… ప్రజలకు సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లేనని తన తాత ఎన్టీ రామారావు, తన తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరి తనకు చిన్నప్పుడు నుంచి నేర్పించారని గుర్తుచేసుకున్నారు.. అదే బాటలో తాను ప్రజాసేవనే దైవ సేవగా భావిస్తున్నానని భక్తుల సమక్షంలో ప్రకటించారు లోకేష్.. ప్రజల ఆశీస్సులతో పాటు భగవంతుడి కృప కూడా ఉంటేనే తాను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చగలనని.. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చడానికి భగవంతుడు తన శక్తి సామర్థ్యం ఇవ్వాలని నారా లోకేష్ ఆకాంక్షించారు. ప్రస్తుతం భారతదేశం మొత్తం మంగళగిరి వైపు చూస్తుందని.. మంగళగిరిలో ప్రజలు తనకు ఇచ్చిన మెజారిటీకి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తనపై మరింత బాధ్యత పెరిగిందని.. మంగళగిరిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్.