విశాఖలో ఏఐ, స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. 2016లో ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు తీసుకొచ్చామని, అందులోని లోపాలు సరిదిద్ది కొత్త చట్టం తెస్తామన్నారు. ఎన్సీసీకి సంబంధించి ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటుపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చించామన్నారు. యువగళం పాదయాత్రలో చేనేతలో కష్టాలు ప్రత్యక్షంగా చూశానని, చేనేత కళాకారులకు ఉచిత విద్యుత్‌కు క్యాబినెట్ ఆమోదం సంతోషాన్నిచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు 2025ను మంత్రి లోకేష్ ప్రవేశపెట్టారు.
‘బిట్స్ ప్రాంగణాన్ని అమరావతిలో ఏర్పాటు కోసం 70 ఎకరాలను కేటాయిస్తూ నిన్న కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం. డీప్ టెక్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళిక చేస్తున్నారు. విశాఖలో ఏఐ, స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసే చేయాలని ప్లాన్ చేస్తున్నాం. 2016లో ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును తీసుకొచ్చాం. అందులో కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని సరిదిద్ది సరికొత్త చట్టాలను తెస్తాం’ అని మంత్రి నారా లోకేష్ చెప్పారు.
స్కూళ్లలో ఎన్సీసీతో పాటు ప్లే గ్రౌండ్స్, ప్రైవేట్ స్కూళ్లలో మౌలిక వసతులపై సభ్యుల ప్రశ్నలకు అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ సమాధానాలు ఇచ్చారు. ఎన్సీసీకి సంబంధించి ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటుపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చించామని, త్వరలో ఈ అంశానికి సంబంధించి నిర్ణయం తీస్కుంటామన్నారు. ప్రైవేట్ స్కూళ్లలో మౌలిక వసతులు, ఇతర అంశాలపై మానిటరింగ్ జరుగుతోందని మంత్రి లోకేష్ బదులిచ్చారు. ‘చేనేత కళాకారులకు ఉచిత విద్యుత్‌కు క్యాబినెట్ ఆమోదం సంతోషాన్నిచ్చింది. చేనేత కళాకారులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం ఇచ్చింది. యువగళం పాదయాత్రలో చేనేతలో కష్టాలు ప్రత్యక్షంగా చూశా’ అని మంత్రి పేర్కొన్నారు.