Site icon NTV Telugu

Yuva Galam Book: యువగళం పుస్తకంపై డిప్యూటీ సీఎం పవన్ ప్రశంస!

Yuva Galam Book

Yuva Galam Book

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన ‘యువగళం’ పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు మంత్రి నారా లోకేశ్‌ అందజేశారు. క్యాబినెట్ భేటీ సందర్భంగా రాష్ట్ర సచివాలయంకు వచ్చిన పవన్‌ను కలిసిన లోకేశ్‌.. బుక్ అందించారు. పవన్‌తో పాటు ఇతర మంత్రులకు కూడా యువగళం పుస్తకం లోకేశ్‌ అందజేశారు. యువగళం పుస్తకంను డిప్యూటీ సీఎం ఓపెన్ చేసి పరిశీలించారు.

Also Read: Botsa Satyanarayana: మాజీ మంత్రి బొత్స సత్య నారాయణకు అస్వస్థత!

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. రాక్షస పాలనపై ప్రజలను చైతన్యం చేయడంలో యువగళం పాదయాత్ర సక్సెస్ అయిందన్నారు. ఆనాటి అనుభవాలను కళ్ళకి కట్టినట్లుగా పుస్తక రూపంలో తేవడంపై లోకేశ్‌ను ప్రశంసించారు. ఈ రోజుకి అరాచక పాలన అంతమై ఏడాది పూర్తయిందని, గత ప్రభుత్వ పాలన పీడకలను ఇప్పటికి జనం మర్చిపోలేదన్నారు. యువగళం పాదయాత్ర నాటి అనుభవాలను ఈ సందర్భంగా యువనేత లోకేష్.. పవన్‌తో పంచుకున్నారు.

Exit mobile version