Minister Nara Lokesh: యువగళం పాదయాత్రలో ఇచ్చిన తోలి హామీ అమలు చేశారు మంత్రి నారా లోకేష్. ఇచ్చినా హామీ మేరకు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసినా లోకేష్ స్వయంగా రేపు డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నారు. పాదయాత్ర సందర్భంగా యాత్రలో పూర్తిచేసినా ప్రతి వంద కి.మీ. వద్ద ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరించారు నారా లోకేష్. అలా మొదటి వంద కి.మీ మైలురాయిని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో తమ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో గ్రామంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని లోకేశ్ ఆవిష్కరించిన శిలాఫలకంలో పొందుపరిచారు.
ఇచ్చిన మాట ప్రకారం వంద రోజుల్లో ఇక్కడి ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటుకు కావాల్సిన యంత్రాలు, పడకలు, ప్రత్యేకమైన నీటి శుద్ధి పరికరాలను కేంద్రంలో ఏర్పా టు చేశారు మంత్రి. బంగారుపాళ్యంతో పాటు అరగొండ, ఐరాల తదితర ప్రాంతా, లకు చెందిన 72 మంది డయాలసిస్ రోగులు ప్రస్తుతం చిత్తూరుకు వెళ్ళి డయాలసిస్ చేయించుకుంటున్నారు. వారందరికీ ఉపయోగ కరమని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఈ డయాలసిస్ కేంద్రాన్ని రేపు స్వయంగా మంత్రి లోకేష్ ప్రారంభించబోతున్నారు దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు జిల్లా అధికారులు.