Site icon NTV Telugu

Minister Lokesh: ఏపీ పరిశ్రమల హబ్‌గా మారుతోంది..!

Nara Lokesh

Nara Lokesh

Minister Lokesh: ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటిగా నిలుస్తోందని తెలిపారు. అనేక పెద్ద పరిశ్రమలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని అన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. విశాఖపట్నం ఇప్పుడు ఐటీ హబ్‌గా రూపుదిద్దుకుంది. గత ఒక సంవత్సరం కాలంలోనే రెండు లక్షల ఉద్యోగాలను అందించగలిగాం. పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకోవడానికి అనుకూల వాతావరణం, వేగవంతమైన సదుపాయాలు, ప్రభుత్వంతో ఉన్న మంచి సంబంధాలు మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని అన్నారు.

PEDDI Movie Second Single: ‘చికిరి చికిరి’తో అదరగొట్టిన రామ్ చరణ్.. రెండో పాట రిలీజ్ అప్పుడే..!

అలాగే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్‌ను తమ కొత్త ప్రాజెక్టుల కోసం ఎంచుకున్నాయని లోకేష్ పేర్కొన్నారు. మంచి సంబంధాలు నెలకొల్పడం వల్లనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి. పెట్టుబడులకు వేగవంతమైన సౌకర్యాలను కల్పిస్తున్నామని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన నవ్విస్తూ “నమో” అంటే నాయుడు, మోదీ అని అన్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో సీఐఐ సదస్సు జరుగనుంది. ఆంధ్రప్రదేశ్‌కు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన సీఐఐకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ సదస్సు ద్వారా సుమారు 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఆశిస్తున్నామని మంత్రి తెలిపారు.

Benjamin Netanyahu: భారత్‌కు ఇజ్రాయిల్ మద్దతు.. ఢిల్లీ ఘటనపై నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు..

Exit mobile version