NTV Telugu Site icon

Karumuri Nageswara Rao: ఆధార్ తో లింక్ తర్వాత దొంగ ఓట్లు బయటికి వస్తున్నాయి

Karumuri

Karumuri

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దొంగ ఓట్లను పుట్టించిందే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని ఆయన ఆరోపించారు. ఆధార్ కార్డుతో లింక్ తర్వాత దొంగ ఓట్లు బయటికి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన కుటుంబ సభ్యులు మళ్ళీ నిన్న కలిసినట్లుగా ఉంది అని మంత్రి వ్యాఖ్యనించారు.

Read Also: Jharkhand: మనుషుల పైకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి, 10 మందికి తీవ్ర గాయలు..

దివంగత నేత ఎన్టీఆర్ మంచి నాయకుడు. చెల్లని నాణాన్ని నందమూరి తారక రామారావు పేరు మీద విడుదల చేశారు అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ నాణెం ప్రజల్లో చలామణి అయ్యేలా ఉండాలి.. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని ఎందుకు పిలువలేదు అని ఆయన ప్రశ్నించారు. ఇక, తూనికలు, కొలతల్లో మోసాలకు పాల్పడుతున్న పలు దుకాణాలపై కేసులు నమోదు చేశామని మంత్రి అన్నారు. నిబంధనలు పాటించని వ్యాపార సంస్థలపై టీడీపీ హయాంలో కేవలం 21 కోట్ల రూపాయల జరిమానా విదిస్తే.. వైసీపీ పాలనలో 40 కోట్ల రూపాయల ఫైన్ వేశామని కారుమూరి తెలిపారు. నిబంధనలు పాటించని వ్యాపార సంస్థలపై 1162కు పైగా కేసులు నమోదు చేసినట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు.

Read Also: BRS Party: సాయిచంద్ కుటుంబానికి అండగా బీఆర్ఎస్.. కుటుంబంలోని అందరికీ చెక్కులు..

2014, 2019 ఎన్నికల్లో టైమ్స్ నౌ చెప్పినట్లుగానే వైసీపీకి సీట్లు వచ్చాయని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. టైమ్స్ నౌ సర్వే ఈసారి మాకు 24 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పింది.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకీ 165 సీట్లు ఖాయం అంటూ ఆయన జోస్యం చెప్పుకొచ్చారు. ఇక, ఇండియా టుడే సర్వే వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు.. సీఎం జగన్ కు వ్యతిరేక ఓటు లేదు.. టీడీపీ హయాంలో ఉచిత ఇసుక ఎవరికైనా అందేదా అని ఆయన ప్రశ్నించారు.