Site icon NTV Telugu

Nadendla Manohar: ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వందే!

Nadendla Manohar

Nadendla Manohar

ఏలూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో టార్గెట్ పేరుతో రైతులను అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న మాటల్లో వాస్తవం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ సంవత్సరం పంట దిగుబడి ఎక్కువగా ఉండటంతో కొంత సమస్య ఏర్పడిందని, లక్ష్యానికి మించి దాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులు వద్ద ప్రతిదాన్యం గింజ కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి మాటలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమరావతికి ప్రధాని రాక నేపథ్యంలో కూటమి నేతలతో మంత్రి నాదెండ్ల సమీక్ష సమావేశం నిర్వహించారు.

Also Read: PSR Anjaneyulu: జైల్లో మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదు.. కోర్టుకి తెలిపిన పీఎస్‌ఆర్‌!

‘అమరావతి పనులు పునః ప్రారంభం కోసం ప్రధాని మోడీ వస్తున్నారు. ప్రధాని పర్యటనపై కూటమి నేతలతో సమీక్ష జరిపాం. ప్రభుత్వ కార్యక్రమమే కాకుండా పార్టీ నేతలు కూడా బాధ్యతగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరాం. ఏలూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున సభకు ప్రజలు వచ్చేలా బస్సులు, కారులు ఏర్పాటు చేస్తున్నాం. సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో టార్గెట్ పేరుతో రైతులను అధికారులు ఇబ్బందులు గురి చేస్తున్నారన్న మాటల్లో వాస్తవం లేదు. ఈ సంవత్సరం పంట దిగుబడి ఎక్కువగా ఉండటంతో కొంత సమస్య ఏర్పడింది. లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. రైతులు వద్ద ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది’ అని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.

Exit mobile version