NTV Telugu Site icon

Merugu Nagarjuna: నియోజకవర్గం మార్పుపై స్పందించిన మంత్రి మేరుగ నాగార్జున.. ఏమన్నారంటే..?

Merugu Nagarjuna

Merugu Nagarjuna

Merugu Nagarjuna: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. టార్గెట్ 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం జగన్ వేగంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా 11 నియోజకవర్గాల్లో కొత్త వారికి బాధ్యతలు అప్పగించింది. ఇందులో 5 ఎస్సీ రిజర్వర్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటి ఫేజ్‌లో నలుగురికి స్థాన చలనం కల్పించారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌కు కొండేపి, మేకతోటి సుచరితకు తాడికొండ, మేరుగ నాగార్జునకు సంతనూతలపాడు బాధ్యతలు అప్పగించారు. మరో మంత్రి విడుదల రజినికి చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ బాధ్యతలు అప్పచెప్పారు సీఎం జగన్‌.. అయితే, నియోజకవర్గ మార్పుపై తొలిసారి స్పందించిన మంత్రి మేరుగ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read Also: Telangana Speaker: స్పీకర్ ఎన్నికకు బీఆర్ఎస్ మద్దతు.. అసెంబ్లీకి కేటీఆర్, హరీష్ రావ్

తనకు నియోజకవర్గం మార్పుపై ఎలాంటి అసంతృప్తి లేదన్నారు మంత్రి మేరుగ నాగార్జున.. వేమూరు నియోజకవర్గం నుంచి మూడు సార్లు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బొమ్మపై గెలిచాను.. ఇప్పుడు సంతనూలపాడు నియోజకవర్గానికి ఇంఛార్జ్‌గా ఉన్నానని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అంతేకాదు, ఎమ్మేల్యేల్లో ఎవరికీ అసంతృప్తి లేదు.. అందరూ మా వాళ్లే.. అందరూ సీఎం వైఎస్‌ జగన్‌ కోసం పనిచేస్తారని ప్రకటించారు మంత్రి మేరుగ నాగార్జున. కాగా, తొలి దశలో 11 నియోజకవర్గాల్లో కొత్త వారికి బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం.. వేమూరు సిట్టింగ్‌ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి మేరుగ నాగార్జునకు సంతనూతలపాడు బాధ్యతలు అప్పగించారు. గ్రూపు తగాదాలున్న కొండేపి విషయంలో జగన్ కఠినంగా వ్యవహరించారు. కొండెపి ఇన్‌చార్జ్‌గా ఉన్న వరికుటి అశోక్ బాబును.. పార్టీలో ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. టికెట్‌ ఇస్తే ఓడిస్తామని సొంత పార్టీ నేతలు హెచ్చరించడంతో.. వరికూటి అశోక్‌బాబుకు వేమూరు బాధ్యతలు అప్పగించారు సీఎం వైఎస్‌ జగన్‌.