Minister Merugu Nagarjuna: తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ బాపట్ల ఎస్పీకి ఫిర్యాదు చేశారు రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున.. బాపట్ల జిల్లాలో ఓ స్థల వివాదంలో గోవింద్ అనే వ్యక్తి కారును సీజ్ చేసి.. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు చుండూరు పోలీసులు.. అయితే, ఈ కారు విడిచిపెట్టాలంటే కొంత సొమ్ము కావాలని పోలీసులు అడిగారని, ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు గోవింద్.. ఈ నేపథ్యంలో కొంత సొమ్మును తీసుకుంటున్న కానిస్టేబుళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అంతటితో ఆగకుండా.. గోవింద్ అనే వ్యక్తి సంచలన కామెంట్లు చేశాడు.. తన దగ్గర లంచం డిమాండ్ చేసిన విషయంలో పోలీసులతో పాటు, మంత్రి నాగార్జున ప్రమేయం కూడా ఉందని, మంత్రి మేరుగ నాగార్జున డబ్బు తీసుకోమని చుండూరు ఎస్సై తో ఫోన్‌లో మాట్లాడటం, లౌడ్ స్పీకర్ లో తాను విన్నానంటూ రికార్డు చేసి.. ఓ వీడియో రిలీజ్ చేశాడు..
Read Also: Kajol Deep Fake Video: వైరల్ అవుతున్న హీరోయిన్ కాజోల్ న్యూడ్ వీడియో
దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. ఇదే వ్యవహారంపై ప్రస్తుతం మంత్రి మేరుగ నాగార్జున మండిపడుతున్నారు.. చుండూరులో జరిగిన ఏసీబీ కేసు విషయంలో, తనను ఏసీబీ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, దీని వెనక ఉన్న కుట్రను దర్యాప్తులో తేల్చాలంటూ పోలీసులను ఆశ్రయించారు.. బాపట్ల జిల్లా ఎస్పీని కలిసిన ఆయన.. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు.. ఈ కేసులో ఉన్న కుట్ర కోణాన్ని తేల్చాలని పేర్కొన్నారు. ఇక, తనకు ఈ కేసు ఎటువంటి సంబంధం లేదని గోవింద్ అనే వ్యక్తి ఎందుకు ఆరోపణ చేస్తున్నాడు? దీని వెనక ఎవరు ఉన్నారు? అనే విషయాలను నిగ్గు తెల్చాలని డిమాండ్ చేస్తున్నారు మంత్రి మేరుగ నాగార్జున.