విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధం అవుతోంది.. ఎల్లుండి సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరగనుంది.. ఈ సందర్భంగా విజయవాడలో బీఆర్ అంబేద్కర్ ఒకరోజు కాంక్లేవ్ నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానాకి మయన్మార్ నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. ఏపీలో అంబేద్కర్ విగ్రహం పెడతామని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఫైర్ అయ్యారు. ముళ్ల కంపల్లో పెట్టడానికి సిద్ధమైంది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం.. తమ ప్రభుత్వం మాత్రం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రతిమను ప్రపంచం గౌరవించేలా ఏర్పాటు చేశాం అన్నారు.
Read Also: Krishna Bridge: వాహనదారులు అలర్ట్.. 45 రోజులపాటు కృష్ణ బ్రిడ్జి బంద్..!
ఎల్లుండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారని తెలిపారు మంత్రి నాగార్జున. రాజ్యాంగం దేశంలో అసమానతలు పోవడానికి ఉపయోగపడుతోందన్న ఆయన.. అంబేద్కర్ అనేక అవమానాలు పొందారు.. కానీ, ఇప్పుడు అంబేద్కర్ ఆలోచనలు భారతావనికి దిక్సూచిగా ఉండటానికి పనికొస్తాయి అన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని భుజానికి ఎత్తుకుని పరిపాలన చేయాలని చూపిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అని పేర్కొన్నారు. మేం చదువుకున్న రోజుల్లో ఇంగ్లీషు చదవాలంటే భయపడే వాళ్లం.. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలోనూ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు రాణిస్తున్నారని తెలిపారు మంత్రి మేరుగు నాగార్జున.
ఇక, మున్సిపల్ శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ వై.శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. అంబేద్కర్ ఒక లెజెండ్… నెల్సన్ మండేలా లాంటి వారి వరుసలో అంబేద్కర్ ఉంటారు.. మన ఆలోచనా విధానం మార్చుకోవడమే మన విజ్ఞానాభివృద్ధికి పనిచేస్తుందన్నారు. కుల ప్రాతిపదికన అంబేద్కర్ తన అటెండర్లతో గేలి చేయబడ్డారు.. అంబేద్కర్ కు ఉన్న డిగ్రీలకు ఆయన సంపాదించుకోటం చాలా తేలిక అని గాంధీ అన్నారని గుర్తుచేశారు. 1942 లో లేబర్ మినిస్టర్ గా పనిచేసారు అంబేద్కర్.. భారత రాజ్యాంగ రచనా కమిటీ కి చైర్మన్ గా అంబేద్కర్ ఉన్నారు.. అంబేద్కర్ విగ్రహం ఎంతో ఎత్తైనది, విగ్రహం కింద ఉన్న మ్యూజియం అందరూ సందర్శించాలని సూచించారు. భారతరత్న అవార్డు తీసుకున్న అంబేద్కర్ కు ఈ విగ్రహం అంకితం ఇస్తామన్నారు శ్రీలక్ష్మి.