NTV Telugu Site icon

Meruga Nagarjuna : అసలు ఎల్లోమీడియా జర్నలిజం చేస్తోందా?

Meruga Nagarjuna

Meruga Nagarjuna

మరోసారి టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు మంత్రి మేరుగ నాగార్జున. తాడేపల్లిగూడెంలో తాజాగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నేతలు తమకు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం వర్తించదన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. పచ్చమీడియా వ్యవహార శైలి కూడా అలాగే ఉందన్నారు. చింతకాయల విజయ్ సోషల్ మీడియా అరాచకవాది అని ఆయన ఆరోపించారు. అతను పెట్టే పోస్టులు ఎంతో దారుణంగా ఉన్నాయని, వాటిపై విచారణ చేస్తుంటే అదికూడా తప్పు అనేలాగ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసలు ఎల్లోమీడియా జర్నలిజం చేస్తోందా? అని ఆయన ప్రశ్నించారు. పోలీసులు విజయ్ ఇంటికి వెళ్తే వీరంతా గగ్గోలు పెడుతున్నారని ఆయన విమర్శించారు. సీఐడీ వారు దొంగని పట్టుకోవటానికి వెళ్తే తప్పా? ఒక మహిళ మీద అభ్యంతరకర పోస్టులు పెట్టడాన్ని వీరు సమర్ధిస్తారా? అని ఆయన అన్నారు. మహిళల మాన, ప్రాణాల గురించి అసభ్యకర పోస్టులు పెట్టాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీడీపీ అనే దాంట్లో ఈ విజయ్ దారుణమైన పోస్టులు పెట్టారని, అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ధన, మానాలను దోచుకున్న వ్యక్తులు ఈ టీడీపీ వాళ్లు అని ఆయన ధ్వజమెత్తారు.

 

అలాంటి వ్యక్తులను ఎల్లోమీడియా ఎందుకు వెనుకేసుకుని వస్తుంది? వీరి అఘాయిత్యాలపై ప్రతిఘటనగా మావాళ్లు ఎవరైనా పోస్టులు పెడితే తట్టుకోలేక పోతున్నారు. చింతకాయల విజయ్ చేసే ఘోరమైన ఇతర వ్యాపారాలకు చంద్రబాబు, లోకేష్ లు సమర్ధిస్తున్నారు. వీరంతా రాష్ట్రాన్ని ఏం చేయదలచుకున్నారు? దేశంలో ఎవరూ చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెచ్చిన జగన్ పై దుష్ర్పచారం చేస్తున్నారు. చింతకాయల విజయ్ కంటే ఎక్కువగా మేము మాట్లాడతాము, తిడతాము. కానీ మాకు సంస్కారం ఉండబట్టి అలా చేయటంలేదు. టీడీపీ వారికి అసలు సిగ్గు అనేది లేదు. చింతకాయల విజయ్ అనే వ్యక్తిపై చట్టం తనపని తాను చేసుకుంటుంది. మహిళలపై సీఐడీ దౌర్జన్యం అంటూ తప్పుడు మాటలు మాట్లాడటం సరికాదు అని ఆయన వ్యాఖ్యానించారు.

Show comments