Site icon NTV Telugu

Mahender Reddy : మంత్రి మల్లారెడ్డి కొడుకు మహేందర్‌ రెడ్డికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

Mallareddy Son

Mallareddy Son

తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి నివాసాలు, ఆస్తులపై ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. మల్లారెడ్డి బంధువుల ఇళ్లలోనూ జల్లడపడుతున్నారు ఐటీ అధికారులు. ఈ రోజు కూడా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. అయితే.. మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మహేందర్‌ రెడ్డి్కి స్వల్పంగా ఛాతిలో నొప్పి రావడంతో సురారంలోని ఓ హాస్పిటల్‌లో ఆయన్ను చేర్పించారు. నిన్న ఉదయం నుంచి ఐటీ అధికారులు మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన కుమారుడు మహేందర్‌ రెడ్డి నివాసంలోనూ తనిఖీలు చేస్తున్నారు.
Also Read : Gold and Silver Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. ఇవాళ బంగారం ధరలు ఇలా..

అయితే.. ఈ నేపథ్యంలో మహేందర్‌ రెడ్డి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. అయితే మహేందర్‌ రెడ్డి కొంపల్లిలోని నివాసం ఉంటున్నారు. ఆయనకు ఛాతిలో నొప్పిరావడంతో సూరారంలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మహేందర్‌ రెడ్డి మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలల్లో డైరెక్టర్‌గా ఉన్నారు. అంతేకాకుండా.. పలు రియల్‌ ఎస్టేట్‌ సంస్థల్లో కూడా డైరెక్టర్‌గా ఉన్నారు.

Exit mobile version