తెలంగాణలో దర్యాప్తు సంస్థల దాడులు హీట్ పెంచుతున్నాయి. రోజుకో టర్న్.. పూటకో ట్విస్ట్‌లతో ఐటీ, ఈడీ, సిట్‌ల సోదాలు, దర్యాప్తులు కొనసాగుతున్నాయి. దాడులు, దర్యాప్తులతో తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. అయితే.. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన చెందిన విద్యాసంస్థలు, కార్యాలయాలు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో గత 24 గంటలుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే.. రెండో రోజు కూడా ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో కీలక పత్రాలను పరిశీలిస్తున్న ఐటీ అధికారులు.. షిఫ్ట్స్ వైజ్ గా సోదాలు నిర్వహిస్తున్నారు. 8 గంటలకు మరొక ఐటీ టీం మల్లారెడ్డి ఇంటికి వచ్చే అవకాశం ఉంది. నిన్న ఉదయం 5: 45 సోదాలు మొదలయ్యాయి. అయితే.. సంతోష్ రెడ్డి ఇంటికి మరోసారి చేరుకున్న ఐటీ అధికారులు.. నిన్న డబ్బుతోపాటు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. నిన్న సంతోష్ రెడ్డి తలుపులు తెరవకపోవడంతో… డోర్స్ బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు ఐటీ అధికారులు.
Also Read : CM YS Jagan Mohan Reddy: నేడు శ్రీకాకుళంలో సీఎం జగన్ పర్యటన
అయితే ఇప్పటివరకు ఐటీ అధికారులు 4.5 కోట్ల నగదును సీజ్ చేశారు. ముందుగా కొంపల్లిలోని గెటెడ్ కమ్యూనిటీల ఉన్న మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డితో పాటు అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇళ్లలో రైడ్ చేశారు. ఆ తరువాత విద్యాసంస్థల్లో తనిఖీలు నిర్వహించారు. మల్లారెడ్డికి సంబంధించిన యూనివర్సీటీ, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. మల్లారెడ్డి కొడుకు, అల్లుడు పలు రియల్‌ఎస్టేట్ పలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు.
Also Read : Earthquake: మహారాష్ట్ర నాసిక్‌లో భూకంపం..
విద్యాసంస్థలతో పాటు రియల్‌ఎస్టే్‌ట్ సంస్థల్లోనూ మహేందర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు డైరెక్టర్‌లుగా ఉన్నారు. అయితే మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ ఇంట్లో రెండు ఎలక్ట్రానిక్ లాకర్లను గుర్తించారు ఐటీ అధికారులు. సుచిత్రలో నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ త్రిశూల్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు రూ.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకోగా.. మహేందర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన రఘునాథ్‌రెడ్డి ఇంట్లో మరొక 2 కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. జీడిమెట్ల పైప్‌లైన్ రోడ్‌లోని రఘునాథ్ రెడ్డి ఇంట్లోనూ దాడులు జరిగాయి. మల్లారెడ్డికి వరుసకు అల్లుడైన సంతోష్ రెడ్డి ఇంటికి వెళ్లి ఐటీ అధికారులు ఆయన డోర్ ఓపెన్ చేయకపోవడంతో డోర్‌ను పగలగొట్టి లోపలివెళ్లిన అధికారులు.. డాక్యుమెంట్లను పరిశీలించారు.