Site icon NTV Telugu

Maganti Gopinath: మాగంటి మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది: నారా లోకేష్

Nara Lokesh

Nara Lokesh

జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతి పట్ల ఏపీ మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. మాగంటి అకాల మరణం బాధాకరమన్నారు. తెలుగుదేశం పార్టీతోనే మాగంటి గోపీనాథ్ గారి రాజకీయ ప్రస్థానం మొదలైందని గుర్తు చేశారు. మాగంటి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. మాగంటి కుటుంబ సభ్యులకు నారా లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాగంటి గోపీనాథ్‌ ఈరోజు కన్నుమూశారు. ఈనెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుదిశ్వాస విడిచారు.

Also Read: Jangaon: వివాహిత అదృశ్యం.. ఆ కారణంతో తాను చనిపోతున్నట్లు లెటర్

‘హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి మృతి దిగ్ర్భాంతికి గురిచేసింది. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన అకాల మరణం పొందడం బాధాకరం. తెలుగుదేశం పార్టీతోనే మాగంటి గోపీనాథ్ గారి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1982లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా వరుసగా మూడు సార్లు విజయం సాధించి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం కృషి చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మాగంటి గోపీనాథ్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.

Exit mobile version