Site icon NTV Telugu

Nara Lokesh: ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్స్.. మా’స్టార్స్’.. మీకు హేట్సాఫ్

Lokesh

Lokesh

ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులు కల్పిస్తూ.. కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చుదిద్దుతోంది ఏపీ ప్రభుత్వం. అయితే కొందరు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తూ అక్కడే క్వాలిటీ ఎడ్యుకేషన్ లభిస్తుందని భావిస్తున్నారు. ఇలాంటి అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి ఆదర్శంగా నిలిచారు. టీచర్ల చొరవపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశాడు.

Also Read:Love: వరుసకు అన్నాచెల్లెళ్ళు.. అయినా ప్రేమించుకున్నారు.. చివరికి ఏమైందంటే?

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించాలని కోరే మీరు, మీ పిల్లల్ని కూడా అదే పాఠశాలల్లో చేర్పించడం ఆదర్శనీయం అని లోకేష్ అన్నారు. ప్రభుత్వ విద్యాలయాలు, ప్రైవేటు విద్యాసంస్థల కంటే మెరుగైనవని గవర్నమెంట్ స్కూళ్లలో చదివిన మీ పిల్లలు సాధించిన ఫలితాలే ప్రత్యక్ష ఉదాహరణలు. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరు జడ్పీ పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌ బొంతు మధుబాబు, పంగిడిగూడెం ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు బాబూ రాజేంద్రప్రసాద్‌, సోమరాజుచెరువు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వీరవాసరపు బాలకరుణాకరరావులకు అభినందనలు తెలియజేస్తున్నాను అని వెల్లడించారు.

Exit mobile version