దేశవ్యాప్తంగా నిర్వహించిన అవినీతి సర్వే గురించి మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. పెరిగిన తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమని ఆయన అన్నారు. అంతేకాకుండా.. అవినీతి వంటి సూచీలోనూ అట్టడుగున ఉండడం కూడా అంతే ముఖ్యమని ఆయన ఉద్ఘాటించారు. 13 రాష్ట్రాలలో తెలంగాణలో అత్యల్ప అవినీతి ఉందని ప్రజలు భావిస్తున్నట్లు CSDS సర్వేలో తేలిందని ఆయన ట్వీట్ చేశారు.
Also Read : CS Shanti Kumari : మిడ్ మానేరు రిజర్వాయర్‌లో ఆక్వా హబ్ ఏర్పాటు
ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో గల వ్యవసాయ యూనివర్సిటీలో ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులను అందించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రామంలో సర్పంచ్ నుంచి రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి వరకు సమర్థమైన నాయకత్వం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయకపోతే అభివృద్ధి జరగదని తేల్చిచెప్పారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏడాదిన్నర పాటు పని చేశానని, గ్రామీణ నేపథ్యం గురించి తనకు చాలా తక్కువ తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Jagan Cabinet Expansion Live: జగన్ కేబినెట్ టీం 3.0లైవ్
పల్లెలకు ఏం కావాలి. పల్లెల్లో ఏ అవసరాలు ఉన్నాయో ముఖ్యమంత్రికి బాగా తెలుసునని, సర్పంచ్ కంటే ఎక్కువగా కేసీఆర్ ఆలోచిస్తారన్నారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి.. పల్లెలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. పల్లెకు, పల్లె ప్రజలకు ఏం కావాలో కేసీఆర్ కు తెలిసినంతగా దేశంలో ఏ నాయకుడికి తెలియదని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Viral : తన పెళ్లికి తానే ఫోటోలు తీసుకున్న ఫోటోగ్రాఫర్
