Minister ktr tribute to krishnam raju at his home
రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. సినీ రాజకీయ ప్రముఖులు కృష్ణంరాజుకు కడసారి వీడ్కోలు ఇవ్వడానికి ఆయన ఇంటికి బయల్దేరారు. ఇక సోషల్ మీడియా వేదికపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కృష్ణంరాజు ఇంటి వద్దకు చేరుకున్న మంత్రి కేటీఆర్ కృష్ణంరాజు పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిత్వానికి తగ్గట్టుగా ఉండే వ్యక్తి కృష్ణంరాజు అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమైందని, అందుకు సంబంధించిన ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఫిల్మ్ ఛాంబర్ తరలించాలి అనుకుంటే… అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని సూచించామన్నారు. అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాలని సీఎం ఆదేశించారని ఆయన వెల్లడించారు. అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం కృష్ణంరాజు ఇంటికి చేరుకున్నారు. కృష్ణంరాజు ఇంట్లో ఎదురెదురుగా తారసపడ్డ చంద్రబాబు, కేటీఆర్. దీంతో.. అభివాదం చేసుకుని, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు ఇద్దరు నేతలు.