రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో గ్రామంలో రూ. 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాను రాష్ట్ర మంత్రి కే తారక రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఆశా వర్కర్లలకు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనేనని ఆయన అన్నారు. పీఎం స్వంత రాష్ట్రం గుజరాత్ కంటే ఎక్కువగా వేతనాలు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. సంఘాలు స్వలాభం కోసం రెచ్చగొడితే ఆశా వర్కర్లులు ఆలోచించాలన్నారు. ఆశా వర్కర్ల ను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుందని ఆయన తెలిపారు.
Also Read : Revanth Reddy : భక్తి ముసుగులో ఒకరు, అభివృద్ధి ముసుగులో మరొకరు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు
కరోనా సంక్షోభం వల్ల వేతనాలు పెంచాలని ఉన్నా.. పెంచలేకపోయామని ఆయన వెల్లడించారు. ఆర్థిక పరిస్థితులు కుదుటపడగానే ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని ఆయన పేర్కొన్నారు. కరోనా కష్ట కాలంలో ఆశా వర్కర్ల సేవలు వెలకట్ట లేనివని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతుందన్నారు. పల్లె దవాఖానా, బస్తీ దవాఖానా, హెల్త్ ప్రొఫైల్, ఉచిత డయాగ్నోసిస్ సేవలు, కేసీఆర్ కిట్ వంటి కార్యక్రమాలు తెలంగాణ లో అమలు అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
Also Read : Manchu Manoj: రాజకీయాల ఆలోచన లేదు, ప్రజా సేవ చెయ్యాలన్న కోరిక వుంది