NTV Telugu Site icon

Allola Indrakaran Reddy : అక్టోబ‌ర్ 4న నిర్మల్‌కు కేటీఆర్.. ఏర్పాట్లపై మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి సమీక్ష

Indrakaran Reddy

Indrakaran Reddy

పురపాలక, పట్టణ అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అక్టోబరు 4వ తేదీన నిర్మ‌ల్ జిల్లాలో పర్యటించనున్నారు. కేటీఆర్‌ పర్యటన సమాచారం నేపథ్యంలో నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో కేటీఆర్ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయ‌నున్న‌ట్లు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వెల్ల‌డించారు. కేటీఆర్ జిల్లా పర్యటన నేప‌థ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఇప్ప‌టికే అధికారుల‌ను ఆదేశించారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన త‌ర్వాత నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని మినీ ఎన్టీఆర్ స్డేడియంలో మ‌ధ్యాహ్నం భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెప్పారు.

Also Read : Asian Games 2023: హాకీలో పాకిస్తాన్పై భారత్ గెలుపు..

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రూ. 714 కోట్ల వ్య‌యంతో చేపట్టిన శ్రీ ల‌క్ష్మిన‌ర్సింహా స్వామి ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని (27 ప్యాకేజ్) ప్రారంభిస్తారు. మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కంలో భాగంగా రూ. 23.91 కోట్ల వ్య‌యంతో నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో ఇంటింటికి న‌ల్లా నీటి స‌ర‌ఫ‌రాను ప్రారంభిస్తారు. సోన్ మండలం పాత పోచంప‌హాడ్ గ్రామంలో 40 ఎక‌రాల విస్తీర్ణంలో రూ. 250 కోట్ల వ్య‌యంతో ఆయిల్ పామ్ ప్యాక‌ర్టీ నిర్మాణానికి శంకుస్థాప‌న చేస్తారు. నిర్మ‌ల్ పట్టణంలోని త‌హ‌సీల్ కార్యాలయ స్థ‌లంలో 2.30 ఎక‌రాల విస్తీర్ణంలో రూ.10.15 కోట్ల వ్యయంతో అధునాతన హంగులతో నిర్మించనున్న‌ స‌మీకృత మార్కెట్ కు శంకుస్థాప‌న చేస్తారు. నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో రూ. 2 కోట్ల‌ టియూఎఫ్ఐడీసీ నిధుల‌తో నిర్మించే దోబీ ఘాట్ ప‌నుల‌కు శంకుస్థాప‌న‌, నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో రూ. 4 కోట్ల టియూఎఫ్ఐడీసీ నిధుల‌తో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న కోసం చేప‌ట్టే ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌ చేస్తారు. వీటితో పాటు.. నిర్మల్ ప‌ట్ట‌ణంలో మంచినీటి స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర్చేందుకు అమృత్ ప‌థ‌కంలో భాగంగా రూ. 62.50 కోట్ల వ్య‌యంతో చేప‌ట్టే ప‌నుల‌కు శంకుస్థాప‌న‌, నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో రూ. 50 కోట్ల టియూఎఫ్ఐడీసీ నిధుల‌తో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న కోసం చేప‌ట్టే ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌, ప్ర‌త్యేక అభివృద్ధి నిధుల ద్వారా రూ. 25 కోట్ల వ్య‌యంతో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌నలో భాగంగా చేపట్టే ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయనున్నారు.

Also Read : Communal Tension: జైపూర్‌లో మత ఉద్రిక్తత.. అపార్ధం చేసుకుని ఒక వ్యక్తి హత్య..