Site icon NTV Telugu

Minister KTR : దేశంలో రెండున్నర శాతం ఉన్న తెలంగాణ 30 శాతం అవార్డులు పొందుతోంది

Minister Ktr

Minister Ktr

దేశంలో రెండున్నర శాతం ఉన్న తెలంగాణ 30 శాతం అవార్డులు పొందుతుందన్నారు మంత్రి కేటీఆర్‌. ఇవాళ మంత్రి కేటీఆర్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు ఆదర్శగ్రామం ఒక గంగాదేవిపల్లి ఉండేదని, ఇప్పుడు వందల గ్రాములు గంగదేవిపల్లి మాదిరిగా మారాయన్నారు. మనల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తించడం లేదని, 40 వేల కోట్లు ఖర్చు చేసి ఇంటింటికి మిషన్ భగీరథ మంచినీళ్ళు ఇస్తున్నామన్నారు. దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. అరవై ఏళ్ళు ఏమి చేయలేదు… ఇప్పుడు ఎన్నికలు వచ్చే సరికి నమ్మించి మోసం చేసేందుకు సంక్రాంతి గంగిరెద్దుల వాళ్ళ మాదిరిగా వస్తున్నారని, ఇప్పుడు పాలకుర్తిలో డాలర్లు దిగుతున్నాయన్నారు మంత్రి కేటీఆర్‌..

Also Read : Supreme Court: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా

అంతేకాకుండా..’దయాకర్ రావు పై కాంగ్రెస్ వాళ్ళు చాలా కసితో ఉన్నారు. ఎర్రబెల్లి ని ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు పెడుతారు. డబ్బులు డాలర్లు ఇస్తే తీసుకోండి.. ఓటు మాత్రం కారు గుర్తుపై వేయండి. ప్రమాణం చేయిస్తే తుపాల్ తుపాల్ అని ప్రమాణం చేసి దయాకర్ రావు ను గెలిపించండి. ఇక్కడ కారు ఉంది… అక్కడ బేకార్ ఉంది. ఇక్కడ రైతుబందు ఉన్నాడు.. అక్కడ 60 ఏళ్ళు పీక్కుతిన్నా రాబందులు ఉన్నారు. ఇది ఎమ్మెల్యే ఎన్నిక కాదు.. మన రాష్ట్ర తలరాత మార్చే ఎన్నిక. కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యే ఎన్నిక. హ్యాట్రిక్ సీఎం అయితే ఢిల్లీని శాసిస్తారు’ అని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Also Read : Amazon Layoffs: ఉద్యోగులకు మళ్లీ షాక్ ఇచ్చిన అమెజాన్.. ఈసారి ఎవరంటే?

Exit mobile version