NTV Telugu Site icon

Minister KTR : సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు మంత్రి కేటీఆర్‌ ప్రశంస

Minister Ktr

Minister Ktr

విలక్షణ నటుడిగా ప్రకాశ్‌ రాజ్‌కు ప్రత్యేక పేరుంది. అయితే.. ఆయన సినిమాల్లోనే కాకుండా.. రాజకీయాల్లో సైతం తన బాణీ కనబరుస్తుంటారు. అయితే.. హైదరాబాద్‌ షాద్‌ నగర్‌ నియోజకవర్గం పరిధిలోని కేశంపేట మండలంలో గల కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అయితే.. ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు పూనుకున్న ప్రకాశ్‌రాజ్‌.. సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్ ను, దిమ్మెలను ఏర్పాటు చేయించారు. అంతేకాకుండా.. గ్రామంలో చెట్లను పెంచి పచ్చని వాతావరణాన్ని నెలకొల్పారు. అలాగే గ్రామస్థుల ఆరోగ్య సమస్యలకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయించారు.

 

ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ పై మంత్రి కేటీఆర్ ప్రశంసలు జల్లు కురిపించారు. ప్రకాశ్ రాజ్ దత్తత తీసుకున్న గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందని కొనియాడిన మంత్రి కేటీఆర్‌.. స్థానిక ఎమ్మెల్యే అంజయ్యతో కలిసి గొప్ప పురోగతిని సాధించారని ప్రశంసించారు.

 

Show comments