NTV Telugu Site icon

Minister KTR: ఈటల రాజేందర్ భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా

Ktr Etlaa

Ktr Etlaa

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భద్రత గురించి మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ కు ఫోన్ చేసి ఆయన వివరాలు తెలుసుకున్నారు. ఈటల భద్రత విషయంలో సీనియర్ ఐపీఎస్ తో సమీక్షించాలని సూచించారు. తన భర్తకు ప్రాణహాని ఉందని ఆయన్ని చంపాలని చూస్తున్నారు అంటూ ఈటల రాజేందర్ భార్య జమున మీడియా ముందు సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ఆరోపించిన గంటల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది.

Read Also: Urfi Javed: ఏంటి ఉర్ఫీ.. ఓ వైపు విప్పుకున్నావు.. మరోవైపు కప్పుకున్నావ్.. ఇదేం డ్రెస్

ఈటల భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈటల రాజేందర్ కు వై-కేటగిరి భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంపు వార్తలతో రాష్ట్ర సర్కార్ తరపున భద్రత ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ భావించారు. దీంట్లో భాగంగానే కేటీఆర్ డీజీపీ అంజనీకుమార్ కు ఫోన్ చేసి సీనియర్ ఐపీఎస్ తో సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో డీజీపీ ఈటలకు భద్రత పెంపు విషయంలో సమీక్ష చేశారు. దీని కోసం సీనియర్ ఐపీఎస్ అధికారి ఈటల నివాసానికి వెళ్లారు.

Read Also: Amit Malviya: రాహుల్ గాంధీపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ట్వీట్లు.. కేసు నమోదు

కాగా తన భర్త ఈటల రాజేందర్ హత్యకు కుట్ర జరుగుతోందని ఆయన భార్య ఈటల జమున ఆరోపణలు చేసింది. రూ.20 కోట్లు ఇచ్చైనా ఈటల రాజేందర్ ను హత్య చేయిస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్‌ రెడ్డి అన్నట్లు ఈటల జమున ఆరోపించడం రాజకీయవర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. ఈ క్రమంలో ఈటలకు భద్రత పెంపునకు ప్రాధాన్యత ఏర్పడింది.

Show comments