Deeksha Divas: తెలంగాణ భవన్లో దీక్షా దివస్.. ఎన్నికల స్క్వాడ్ అభ్యంతరం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR participate in Deeksha Divas: హైదరాబాద్ నగరంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ చేపట్టిన ‘దీక్షా దివస్’పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్క్వాడ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గడువు మంగళవారం సాయంత్రం ముగిసిన నేపథ్యంలో ఈసీ అభ్యంతరం తెలిపింది. పార్టీ కార్యాలయాల్లో ప్రచారం నిర్వహించొద్దని ఈసీ అధికారులు అనగా.. దీక్షా దివస్ ఎన్నికల కార్యక్రమం కాదని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఆపై తెలంగాణ భవన్‌కు మంత్రి కేటీఆర్ చేరుకున్నారు.
తెలంగాణ భవన్లో నిర్వహించిన దీక్ష దివస్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిర కార్యక్రమం ప్రారంభించి.. రక్తదానం చేశారు. అనంతరం దీక్షా దివస్‌పై మాట్లాడారు. ఆనాటి ఉద్యమ చైతన్యాన్ని మరొకసారి గుర్తుకు తెచ్చుకోవాలని కేటీఆర్ అన్నారు. 2009లో సీఎం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను గుర్తు చేశారు.
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
Also Read: Telangana Assembly Elections 2023: రేపే పోలింగ్.. ప్రలోభాల జాతర పీక్స్‌కి..!
తెలంగాణ మలి దశ ఉద్యమానికి బీజం పడిన రోజు 2009 నవంబర్ 29. తెలంగాణ రాష్ట్ర సాధనకు సీఎం కేసీఆర్ సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ‘తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో…’ అని నినదిస్తూ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగి ఢిల్లీ పీఠం దిగొచ్చేందుకు నాంది పలికారు. సరిగ్గా నేటితో తెలంగాణ సాధన కోసం కేసీఆర్ నిరాహార దీక్షకు దిగి 14 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దీక్షా దివస్ కార్యక్రమం చేపట్టారు.
తాజావార్తలు
-
LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?