NTV Telugu Site icon

Minister KTR: ప్రతి నియోజకవర్గం నుంచి పదివేల మంది రావాలి

Ktr

Ktr

Minister KTR: సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలపై మంత్రి కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రేటర్ హైద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టినందున ప్రతి నియోజక వర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సచివాలయ ప్రారంభ అనంతరం పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభకు ప్రతి నియోజకవర్గం నుంచి 10 వేల మంది హాజరయ్యేలా చూడాలని ప్రజా ప్రతినిధులకు సూచించారు.

Read Also: Global Investment Summit: వాస్తవ పెట్టుబడుల కోసమే మా ప్రయత్నం.. ప్రచార ఆర్భాటం, ప్రకటనలు కాదు..!

జన సమీకరణ కోసం ఈ నెల 13 న గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలన్నారు మంత్రి కేటీఆర్. ఇతర జిల్లాలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రతి నియోజకవర్గానికి ఇంచార్జిలుగా నియమిస్తామన్నారు. ఇంచార్జిలు 13 నుంచి 17 వరకు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లోనే ఉండి పర్యవేక్షిస్తారని తెలిపారు. సచివాలయ ప్రారంభోత్సవం, పరేడ్ గ్రౌండ్ సభను అందరు కలిసికట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Read Also: Revanth Reddy : అధికారంలోకి వస్తే ప్రగతిభవన్‎ను అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్‎గా మారుస్తాం

Show comments