Site icon NTV Telugu

గులాబీ దుస్తులు ధరించే ప్లీనరీకి రావాలి :కేటీఆర్

ఈ నెల 25 న ప్లీనరీలో పార్టీ అధ్యక్షున్ని ఎన్నుకుంటామని.. గులాబీ దుస్తులు ధరించి ప్రతినిధులు ప్లీనరీకి రావాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పేర్కొన్నారు. హైటెక్స్ లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ… దశాబ్దాల తెలంగాణ కలను టీఆర్ఎస్ సాకారం చేసిందని.. బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పిన బోధించు సమీకరించు పోరాడు అన్న మాటల స్ఫూర్తితో ఉద్యమాలను కొనసాగించామని తెలిపారు.

14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలను జాగృతం చేసి జాతీయ రాజకీయాలను శాసించే శక్తి గా రాష్ట్రాన్ని తీర్చి దిద్దామన్నారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో అనేక ఆటు పోట్లను ఎదుర్కొన్నా… తెలంగాణ పట్ల నిబద్ధతతో ఉద్యమించామని స్పష్టం చేశారు కేటీఆర్‌. స్వ రాష్ట్రాన్ని సాధించిన తరువాత అద్భుతమైన పరిపాలనతో పరిపాలన సంస్కరణల తో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్లీనరీకి సుమారు ఆరు వేలకు పైగా పార్టీ ప్రతినిధులు వస్తారని.. వారందరినీ పార్టీ రంగు గులాబీ దుస్తులు ధరించి రావాలని కోరుతున్నామన్నారు కేటీఆర్‌.

Exit mobile version