రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో రూ.8.5 కోట్లతో అభివృద్ది చేసిన విద్యా క్యాంపస్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. విద్యతోనే వికాసం…ఆనందం అని ఆయన అన్నారు. మంచి చదువు కుంటే ఎవరూ పైరవీలు అవసరం లేదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఒక్కతరం చదువు కుంటే ఆ కుటుంబం ఎప్పటికీ బాగుంటుందని, వ్యవస్థ లోపాలు ఎప్పటికీ ఉంటాయని, అన్నింటినీ భూతద్దంలో చూడవద్దని ఆయన అన్నారు. సరిగ్గా 9 ఏళ్ల మన బడి ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందని, అనాడు కరెంట్ ఎలా ఉండే, సాగునీరు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందని ఆయన అన్నారు.
Also Read : Sexual Harassment: ఢిల్లీలో దారుణం.. పదేళ్ల బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్
ప్రభుత్వం ఆలోచన, చిత్తశుద్ది ఎలా ఉంది అనేది ముఖ్యమని, 3,416 తండాలను గ్రామ పంచాయితీలుగా చేశామని ఆయన అన్నారు. ఉచిత కరెంట్, రైతు బీమా, రైతు బంధు, 9 ఏళ్ల క్రితం ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు అగం కావద్దు, ఎవడో వచ్చి ఉపన్యాసాలు ఇవ్వగానే తొందర పడవద్దని, మేము ఖర్చు పెట్టే డబ్బులు ప్రజలదే మా పైసలు కాదు. అందుకే జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నామని ఆయన అన్నారు. నేను కారులో వస్తుంటే ఇద్దరు ముగ్గురు పొరగల్లు వచ్చి అడ్డం వస్తారు ఏమీ అవుతుంది.. డ్రామాలు వద్దు.. మా కంటే 55 ఎండ్ల నుండి ఉన్నవారు ఏం చేశారని ఆయన మండిపడ్డారు. మా లెక్క ప్రకారం మేము ముందు పోతమని, ఇక్కడ ఎంపీ వలన అర పైసా ఖర్చు చేశాడా అని ఆయన అన్నారు.
Ram Charan Daughter: రాముడి జన్మ నక్షత్రంలోనే రామ్ చరణ్ కుమార్తె జననం!
మీ ఎంపీకి చేతనైతే మేము ఒక్క బడి కడితే మీరు రెండు కట్టమనండని సవాల్ విసిరారు. మేము ఏది చేసినా కాళ్లకు అడ్డడం పడడం.. కొంత మంది పోలీసులతో అడ్డం పెట్టుకుంటున్నారని వ్యాఖ్యానించడం, నేను మాత్రం పోలీస్ లను అడ్డం పెట్టుకొను, నేను ప్రజల మధ్యలో ఉండే వాడిని, నాకు ప్రజలు ముఖ్యమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలు దయతలిస్తే మళ్ళీ ఎమ్మెల్యే గా సేవ చేస్తానని, రాష్ట్రంలో 26 వేల పాఠశాలను విడుతల వారీగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రతి పక్షాలకు పని పాట లేదు..రెండు అంశాలు పట్టుకొని తిరుగుతారని, అన్నింటిలో సిరిసిల్ల ముందజలో ఉందన్నారు. అలాగే విద్యలో జిల్లా అగ్రగామిగా నిలబడాలని, పిల్లలో కులం మతం అనే భావన రావద్దన్నారు. విద్య అంశం ఒక్కటే కాదని, సమాజం పై పాఠ్యాంశాలు చేర్చాలన్నారు. బాలికల కోసం సెల్ఫ్ డిఫెన్స్ అనేది అన్ని పాఠశాలలో ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.