Site icon NTV Telugu

Minister KTR : మా సహనాన్ని పరిక్షించవద్దు.. బీజేపీకి కేటీఆర్‌ వార్నింగ్‌

Ktr Road Show

Ktr Road Show

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయం వేడెక్కుతోంది. రేపు మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్‌ జరుగనుంది. నిన్నటితో ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. అయితే.. నిన్న పాలివెలలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య దాడులు జరిగాయి. దీంతో ఇరువర్గాలకు చెందిన నేతలు గాయపడ్డారు. అయితే.. తాజాగా దీనిపై మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. హింసకు తావు ఇవ్వని పార్టీ టీఆర్ఎస్ అని, ఢిల్లీ నుంచి ఆదేశాలతో బీజేపీ హింసకు పాల్పడుతోందన్నారు. అంతేకాకుండా.. ఎవరు ఎవరి మీద ఎవరు దాడి చేసారో వీడియోలు ఉన్నాయని, ఈటల పీఏ రాళ్ల దాడి చేశారని ఆయన ఆరోపించారు. మా పై దాడి చేసి.. మళ్ళీ సానుభూతి కోసం బీజేపీ ప్రయత్నం చేస్తోందన్నారు.
Also Read : Munugode Bypoll: రేపు మునుగోడులో సెలవు..

తెలంగాణలో శాంతి ఉందని, బీజేపీ హింస సిద్ధాంతంను తిప్పి కొట్టే సత్తా ఉందన్నారు. బీజేపీ చిల్లర ప్రయత్నాలు మానుకోవాలని, మునుగోడులో బీజేపీ సానుభూతి కోసం ప్రయత్నం చేస్తోందన్నారు. బీజేపీ ఇదే సంస్తృతి కొనసాగిస్తే…మేము తిరగబడతామని ఆయన అన్నారు. బీజేపీ, మోడీ లు ఫెకులు అని, తప్పుడు వీడియోలు, ఆడియోలు, పిచ్చి వేషాలు వేస్తే,తప్పుడు ప్రచారం చేస్తే జైళ్లలో మగ్గాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు. మా సహనాన్ని పరిక్షించవద్దన్న మంత్రి కేటీఆర్‌.. హింసకు తెగబడ్డ వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Exit mobile version