Site icon NTV Telugu

Minister KTR : బీజేపీ రాజ్యాంగ సంస్థలను అడ్డం పెట్టుకొని శిఖండి రాజకీయాలను చేస్తోంది

Minister Ktr

Minister Ktr

భారతీయ జనతా పార్టీ ఒక విష సంస్కృతికి తెరతీసిందని, మునుగోడు ప్రజలను ధనమదంతో గెలవాలన్న కుటిల ప్రయత్నం చేస్తున్నదని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆరోపించారు. గురువారం రాత్రి ప్రగతి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ సంకల్పంతోనైతే ఫ్లోరోసిస్ సమస్యను, మిషన్ భగీరథతో తాగునీటి సమస్యను, సాగునీటి ప్రాజెక్టులను, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకెళ్లామో అదే సంకల్పంతో మరింత ముందుకు పోతామని, ఎన్నికల్లో ప్రజాబలంతో గెలవలేక రాజ్యాంగ సంస్థలను అడ్డం పెట్టుకొని శిఖండి రాజకీయాలను చేస్తుందని, భారతీయ జనతా పార్టీ ఒక నీతి జాతి లేని పార్టీ అంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. నల్లగొండ ప్రజలు ఏ విధంగా అయితే హుజూర్‌నగర్ నాగార్జునసాగర్ లో టీఆర్ఎస్ పార్టీకి గెలుపును కట్టపెట్టారో అదే ఫలితం మునుగోడు లోను పునరావృతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవిష్యత్తు పైన ప్రభావం చూపించే ఈ ఎన్నికల్లో మంచి నిర్ణయం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నా. అత్యధిక నిరుద్యోగం, ప్రపంచంలోనే అత్యధికంగా గ్యాస్ సిలిండర్ ధర, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో అత్యంత కింది స్థానానికి దేశాన్ని పడేసిన ప్రధానమంత్రి, ఆయన పార్టీ బిజెపికి బుద్ధి చెప్పాలని కోరుతున్నాను. కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించి అర్హత ఏమాత్రం లేదు. ఆయన ఒక నిస్సహాయ మంత్రి. కెసిఆర్ ను తిట్టినంత మాత్రాన మీకు ఓట్లు పడవు. ప్రజలకు మంచి పనులు చేస్తే, వాటిని చెప్తే ఓట్లు వేస్తారు. ధైర్యంగా కరోనా వ్యాక్సిని కనిపెట్టిన ప్రధాని అన్న అమాయకుడు కిషన్ రెడ్డి. ప్రపంచంలోనే అతిపెద్ద కాలేశ్వరం ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ అయితే కిషన్ రెడ్డి సీతాఫల్మండిలో నాలుగు లిఫ్టులను కేంద్రం నుంచి తెచ్చారు. కిషన్ రెడ్డికి కనీసం రాసిచ్చిన స్క్రిప్ట్ కూడా చదివే తెలివి లేదు. కిషన్ రెడ్డి అమాయకుడు. బీజేపీ కి దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణకి ఏం తెచ్చారో ప్రజలకు చెప్పి మునుగోడులో ఓటు అడగాలి. 2016లో నడ్డా అనే అడ్డమైనోడు మర్రిగూడలో పెడతామన్న కరోనా రీసెర్చ్ సెంటర్ మరియు హాస్పిటల్స్ సంగతి ఏమైందో చెప్పాలి. కేంద్ర రాజ్యాంగ సంస్థలన్ని బిజెపి చేతిలో కీళ్లు బొమ్మలుగా మారాయి. ఇవన్నీ కూడా బిజెపికి అనుబంధ సంఘాలుగా పేర్లు మార్చుకుంటే మంచిగా ఉంటుంది.

Also Read : పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్లు ఎవరో తెలుసా..?

తెలంగాణ ప్రభుత్వ పనితీరు వలన ఫ్లోరోసిస్ సమస్య అంతమైంది. ఫ్లోరోసిస్ బాధిత గ్రామాలు లేవని కేంద్రమే చెప్పింది. ఇందుకు కారణమైన మిషన్ భగీరథకు నిధులు ఇవ్వమని నీతి అయోగ్ చెప్తే 18 వేల కోట్లు రాజగోపాల్ రెడ్డికి ఇచ్చింది, కానీ ఫ్లోరోసిస్ సమస్య కోసం 18 రూపాయలు కూడా ఇవ్వలేదు. రాజగోపాల్ రెడ్డి చిన్న కంపెనీకి ఇంత పెద్ద కాంట్రాక్టులు ఎట్లా వస్తున్నాయో చెప్పాలి. ఇందులో దాగిన గుజరాత్ గూడుపుఠాని ఏమిటో ప్రజలకు చెప్పాలి. కోమటిరెడ్డి సోదరులు చేస్తుంది కోవర్ట్ రాజకీయం కాదా. బిజెపి కాంగ్రెస్ లు కలిసి కుట్రజేస్తుంది వాస్తవం కాదా… ప్రజలను తమ అబద్ధాలు అసత్యాలతో లోబర్చుకొని గెలుస్తామంటే ప్రజలు అమాయకులు కాదు… కర్ణాటక గుజరాత్ లో 3000 వృద్ధాప్య పింఛన్లు ఇవ్వనిది తెలంగాణలో ఎక్కడి నుంచి ఇస్తారు. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలుంటాయన్న సామెతను బూర నర్సయ్య నిజం చేస్తున్నారు… ఆయన గ్రహచారం బాగాలేదు…అందుకే పార్టీ మారారు… అటల్ బిహారీ వాజ్పేయి టేబుల్ పైన ఫ్లోరోసిస్ బాధితులనుంచినా ఒక్క పైసా రాలేదు… కనీసం మోడీ అయినా ఫ్లోరోసిస్ బాధ్యులకు ఒక్క పైసలు అనే ఇచ్చారా… మునుగోడు లో ఉన్న ఓటర్లలో 99.15 శాతం మందికి తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి జరుగుతున్నది. చేసిన పనులు చెప్పి బరాబర్ ఓట్లు అడుగుతాం… ప్రధానమంత్రి వ్యాక్సిన్ కనిపెట్టారు, 3000 పెన్షన్ ఇస్తాం వంటి అబద్ధాలు చెప్పకుండా, చేసిన పని చెప్పి బిజెపి ఓట్ల అడగాలి. దేశ చరిత్రలో తొలిసారి చేనేతపై పన్నువేసి చేనేతలకు మరణ శాసనం రాసిండు మోడీ, అలాంటి బిజెపి నుంచి రావాలని ఒక చేనేత సొదరున్ని అడిగినా, తప్పా… మరోవైపు చేనేతలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న చేనేత మిత్ర,నేతన్నకు చేయూత, నేతన్న భీమా వంటి కార్యక్రమాలను వివరించి ఓట్లు అడిగినా అందులో ఏమైనా తప్పుందా. అని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version