Minister KTR Fires on Bandi Sanjay
తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. అయితే.. రాష్ట్ర బీజేపీ అధినేత బండి సంజయ్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ లు ట్విట్టర్ వేదికగా ఒకరిపై ఒకరు ట్విట్టస్త్రాలు సంధించుకుంటున్నారు. అయితే.. రానురాను ఈ ట్విట్టస్త్రాల ధాటి పెరుగుతోంది. అయితే.. నిన్న బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై విమర్శలుగు చేస్తున్న వీడియోను మంత్రి కేటీఆర్ పోస్ట్ చేసి… బండి సంజయ్‌కు పిచ్చి్ ముదిరిందంటూ.. పిచ్చాసుపత్రిలో బెడ్ ఖాళీగా ఉందని ట్విట్ చేశారు. అయితే.. దానికి కౌంటర్ బండి సంజయ్ మరో ట్విట్టస్త్రాన్ని ప్రయోగించారు.
అయితే.. ఇప్పుడు తాజాగా మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా.. ‘నల్ల పిల్లులు… తాంత్రికులు, తెలంగాణకు ఎన్‌డిఎ ప్రభుత్వం ఏమి అందించిందో చెప్పుకోవడానికి ఏమి లేదు, అందుకే ఇటువంటి వాటిపై ఆధారపడవలసి వచ్చింది. పిచ్చోడి చేతిలో రాయి = లవంగం చేతిలో బీజేపీ’ అని ఆయన ట్విట్ చేశారు. అయితే.. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తెలంగాణ రాజకీయం మొత్తం మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తిరుగుతోంది. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ సాగుతోంది.
