Site icon NTV Telugu

Minister KTR : భారతదేశం వరల్డ్ కప్ గెలుస్తుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కొనసాగుతుంది

Minister Ktr

Minister Ktr

భద్రాద్రి ఇల్లందులో బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియ నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. భారతదేశం వరల్డ్ కప్ గెలుస్తుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కొనసాగుతుందన్నారు. 11సార్లు కాంగ్రెస్ పరిపాలించిన అభివృద్ధి చేయలేదన్నారు మంత్రి కేటీఆర్‌. పార్టీలో చిన్న చిన్న విభేదాలు సాధారణం. సర్దుకొని పోవాలని, చిన్న చిన్న సమస్యలు ఉంటాయన్నారు. అన్నీ తెలిసిన నాయకుడని, తెలంగాణను చావులో తలపెట్టి తెచ్చిన నాయకుడు కేసీఆర్ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సింగరేణి 34 శాతం లాభాల బోనస్‌లు చెల్లించింది కేసీఆర్ ప్రభుత్వమన్నారు.

Also Read : IND vs AUS: గత 10 ఓవర్ల నుంచి లేని బౌండరీ.. ఆచితూచి ఆడుతున్న కోహ్లీ, కేఎల్ రాహుల్

అంతేకాకుండా.. ‘కొట్లాడి అభివృద్ధి అభివృద్ధిని సాధిస్తుంది హరిప్రియ నాయక్. ఇల్లందు ప్రజలు గులువుడు గులుగుడే బి ఆర్ఎస్ కు ఓటు గుద్దుడు గుద్దుడే. ఢిల్లీవాడు వచ్చి చిచ్చు పెడితే వినవద్దు. 11 సార్లు అవకాశం ఇస్తే కాంగ్రెస్ కరెంట్ ఇవ్వలేదు. బయ్యారంలో ఎక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తానన్న మోడీ మాట తప్పాడు. హరిప్రియను గెలిపించి పంపండి 15 రోజులలో కొమరారంను ,మండలంగా, ఇల్లందును రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తాం. 3వే ల కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న సీతారామ ప్రాజెక్టు త్వరలో వస్తుంది. హరిప్రియ అధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత ఇల్లందు ప్రజలదే. వృద్ధులకు 5000 పెన్షన్ ఇవ్వబోతున్నాం. గ్యాస్ 400 ఇవ్వబోతున్నాం. అ సైన్లు భూములను వారికి పూర్తి హక్కులు కల్పిస్తాం. రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగునా మోడీ అడ్డుపడుతున్నాడు అతను కూడా పక్కకు జరిపే ప్రయత్నం చేద్దాం. ఇక్కడి సింగరేణి కాపాడుకుంటా. అన్ని విధాలుగా కార్మికులను ఆదుకుంటాం.’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Also Read : Bhatti Vikramarka : ఈ నెల 30 తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదు

Exit mobile version