Site icon NTV Telugu

Minister KTR : కేంద్ర ప్రభుత్వంలా ఒక వ్యక్తినే పల్లకిలో మోయం

Minister Ktr

Minister Ktr

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే.. నేడు అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. సింగరేణి గనులు ఎందుకివ్వరో కేంద్రాన్ని నిలదీయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కౌంటర్‌ ఇచ్చారు. ఈటల రాజేందర్ సింగరేణి గురించి చాలా ఆవేదన మాట్లాడారని, కేంద్రంలో అధికారంలో ఉన్నది వాళ్ళ పార్టీ కాబట్టి… ఏం మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. దేశంలో బొగ్గు బ్లాక్‌ల నుంచి బొగ్గు కొనవద్దని కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసిందన్నారు. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలని రాష్ట్రాలను కోరిందని ఆయన వెల్లడించారు. ఎవరి ప్రయోజనాల కోసం కేంద్రం అలా కోరుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఆస్ట్రేలియా ఇండోనేషియా వెళ్లి వచ్చిన తర్వాత వెంటనే ఆయన దోస్త్‌కు పెద్ద బొగ్గు గనులు కేటాయిస్తారని, ఒక్క దోస్తుకోసం పనిచేసే సర్కార్ మాది కాదన్‌నారు.

Also Read : Kim Wife: కిమ్ మాత్రమే కాదు.. ఆయన భార్య ఏం చేసినా సంచలనమే

సింగరేణి ప్రైవేట్ పరం చేసేది లేదని కేంద్రం చెబుతుందని ఈటల అంటున్నారు… మరి విశాఖ ఉక్కును తుక్కుగా అమ్ముతున్నది ఎవరని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. అంతకుముందు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. సింగరేణికి కొన్ని బ్లాకులు కేంద్రము కేటాయిస్తే… అవి వద్దని రాష్ట్ర సర్కారు లేఖ రాసిందన్నారు. కేంద్ర సర్కార్‌కు సింగరేణి ప్రైవేట్ పరం చేయాలని ఆలోచన లేదని, ప్రైవేట్‌ కాంట్రాక్టర్లకు సింగరేణి కేటాయించిన కొల్ బ్లాకులు ఇవ్వద్దని కోరుతున్నామన్నారు. బొగ్గు బ్లాగులు వద్దని కేంద్రానికి రాష్ట్ర సర్కార్ రాసిన లేఖ నా వద్ద ఉందని ఈటల వ్యాఖ్యానించారు. అయితే.. ఈటల వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ పైవిధంగా స్పందించారు.

Also Read : Jewellery Prices: ఏప్రిల్‌ నుంచి ఖరీదు కానున్న ఆభరణాలు

Exit mobile version