NTV Telugu Site icon

Minister KTR : సుఖేష్‌ ఆరోపణలపై స్పందించిన మంత్రి కేటీఆర్‌

Ktr

Ktr

రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్‌ తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై పలు ఆరోపణలు చేశారు. అయితే.. దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ.. ‘మోసగాడు, నేరస్థుడు సుఖేష్ నాపై కొన్ని హాస్యాస్పదమైన ఆరోపణలు చేశాడని మీడియా ద్వారా తెలుసుకున్నాను. నేను ఈ పోకిరీ గురించి ఎన్నడూ వినలేదు … అతని అర్ధంలేని మాటలపై చట్టపరమైన చర్య తీసుకోవాలనుకుంటున్నాను. ఇటువంటి కామెంట్స్ విషయంలో మీడియా జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థన’ అని ఆయన ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. అయితే మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్‌ తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందర్ రాజన్‌కు లేఖ రాశారు.

Also Read : Ponguleti Sudhakar Reddy: ఖమ్మంలో 16న వనభోజనాలు.. 29న సేవా సుపరిపాలన సభ

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌పై సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ రాశారు. ‘‘నా వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కవిత, కేటీఆర్ తరపు సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారు. కవితకు వ్యతిరేకంగా ఈడీకి ఇచ్చిన స్టేట్‌మెంట్లలోని ఎవిడెన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఆధారాలు ఇస్తే రూ.100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీట్ ఇస్తామని ఆశపెడుతున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి. కవితకు నాకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ అంతా రికార్డింగ్ ఉంది.

Also Read : Sonakshi Sinha Pics: పొట్టి డ్రెస్‌లో సోనాక్షి సిన్హా భారీ అందాలు!

ఈ ఆధారాలని ఇప్పటికే ఈడీకి 65 -బి సర్టిఫికెట్ రూపంలో ఇచ్చేశా. కవిత నుంచి రూ.15 కోట్ల నగదు తీసుకొని అరవింద్ కేజ్రీవాల్ తరపు వారికి అందజేశా. ఈ అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతున్నా’’ అంటూ గవర్నర్‌ తమిళసైకు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు. అయితే.. ఈ సుఖేష్ వ్యాఖ్యలపై స్పందిస్తూ మంత్రి కేటీఆర్ పై విధంగా స్పందించారు.