ప్రియాంకగాంధీ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ.. రాజకీయ నిరుద్యోగులు రాష్ట్ర యువతను రెచ్చగొడుతున్నారని, పొలిటికల్ టూరిస్టులకు తెలంగాణ స్వాగతం చెబుతుందన్నారు. ప్రియాంక గాంధీ తన పొలిటికల్ టూర్ ని ఎడ్యుకేషన్ టూర్ గా మార్చుకుని, తెలంగాణలోని తమ పరిపాలన విధానాలను… ప్రజలకు అందుతున్న వాటి ఫలాలను తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఎంప్లాయిమెంట్ పాలసీ ఒకటి ఉంటే దేశంలో ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఉండేదే కాదని, అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగాన్ని పెంచి పోషించినందుకు యువతకు ముందుగా క్షమాపణ చెప్పాలన్నారు.
Also Read : GT vs LSG: గుజరాత్ టైటాన్స్ తాండవం.. లక్నో ముందు భారీ లక్ష్యం
సకాలంలో తెలంగాణ ఇవ్వక …. నీళ్లు-నిధులు-నియామకాల నినాదంతో పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారుల బలిదానాలకు కారణమైనందుకు ప్రియాంక గాంధీ కాంగ్రెస్ తరఫున క్షమాపణ చెప్పాలని, సోనియాగాంధీని బలిదేవత అన్న వ్యక్తికే పీసీసీ చీఫ్ పదవి ఇచ్చిన కాంగ్రెస్ నాయకత్వానిది అమాయకత్వమో, ఆత్మహత్యా సదృశ్యమో తేల్చుకోవాలన్నారు మంత్రి కేటీఆర్. ప్రభుత్వ రంగంలో 2.2 లక్షల ఉద్యోగాలు, ప్రైవేటు రంగంలో 22 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, పదేళ్లుగా అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్ ఫ్రస్టేషన్ లో ఉందన్నారు మంత్రి కేటీఆర్. 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ అని, తప్పుడు కేసులు వేసి ప్రాజెక్టులు అపినా, అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తున్న సొంత పార్టీ నేతలకు ప్రియాంకగాంధీ బుద్ధిచెప్పాలన్నారు. గాంధీ భవన్ ను గాడ్సేకు అప్పగించి తన అంతానికి కాంగ్రెస్ వీలునామా రాసుకుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read : Virat Kohli Row: కోహ్లీని మళ్లీ రెచ్చిగొట్టిన నవీన్.. గంభీర్ కూడా!
