Site icon NTV Telugu

Minister KTR : సంస్కారం గురించి కాంగ్రెస్ నేతల దగ్గర నేర్చుకోవాల్సిన కర్మ మాకు లేదు

Ktr

Ktr

2014 వరకూ సోషల్ మీడియా పెద్దగా అందుబాటులో లేదని, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నవారు ఇంకా కొత్త రకము ఎన్నికల విధానానికి అలవాటు పడలేదన్నారు మంత్రి కేటీఆర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియా ప్రభావం తెలియని నేతలు ఇంకా ఉన్నారని, నరేంద్ర మోడీని ఆ రోజు రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి తీసుకెళ్లింది సోషల్ మీడియానే అన్నారు. ఇదే సమయంలో జానా రెడ్డికి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. సంస్కారం గురించి కాంగ్రెస్ నేతల దగ్గర నేర్చుకోవాల్సిన కర్మ మాకు లేదన్నారు.

Also Read : Allu Arjun: ఇద్దరు పోరంబోకులకు నేషనల్ అవార్డు వచ్చింది..

జానారెడ్డి సంస్కారాన్ని ముందు వాళ్ల పీసీసీ ప్రెసిడెంట్ కు నేర్పించాలని ఆయన కోరారు. కేసీఆర్ కు పిండం పెట్టాలన్నప్పుడు జానారెడ్డి సంస్కారం ఎక్కడ పోయిందని ఆయన ప్రశ్నించారు. రాళ్లతో కేసీఆర్ ను కొట్టి చంపాలన్నప్పుడు మీ సంస్కారం ఏమైంది? అని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. 50 కోట్లకు పిసిసి పదవి అమ్ముకున్న దగుల్బాజీ పార్టీ కాంగ్రెస్ అని, రేవంత్ రెడ్డి డబ్బులు వసూలు చేస్తున్నాడని సొంత పార్టీ నేతలే ఈడికి ఫిర్యాదు చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ప్రజల మూడ్ బీ ఆర్ ఎస్ వైపే ఉందని, కేసీఆర్ పైన జనం క్లారిటీ ఉందన్నారు. న్నికలలో పోటీ చేయటానికి కిషన్ రెడ్డి భయపడ్డారని కేటీఆర్‌ అన్నారు.

Also Read : Sehar Shinwari: పాకిస్థాన్ నటి మరోసారి బంపర్ ఆఫర్.. ఈసారి న్యూజిలాండ్కు

Exit mobile version