Site icon NTV Telugu

Minister KTR : ప్రజలకు చాలా స్పష్టత ఉంది.. ప్రతిపక్షాలే అయోమయంలో ఉన్నాయి

Ktr

Ktr

ప్రగతిభవన్‌ ఇవాళ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థుల ప్రకటన తర్వాత రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి మరింత సానుకూల వాతావరణం ఉన్నదన్నారు. 90 స్థానాలకు పైగా గెలుస్తాం, కెసిఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారన్నారు. క్షేత్ర స్థాయి నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ సమాచారం ప్రకారం కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి ఉండాల్సిన అవసరం ఉన్నదని ప్రజలు భావిస్తున్నారని, పది సంవత్సరాలల్లో ప్రభుత్వం అందించిన పథకాలు, సంక్షేమ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలే అద్భుతంగా వివరిస్తున్నారన్నారు కేటీఆర్‌.

Also Read : ACB Court: చంద్రబాబు కేసు ఎఫెక్ట్‌..! ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి భద్రత..

ప్రజలకు చాలా స్పష్టత ఉంది, ప్రతిపక్షాలే అయోమయంలో ఉన్నాయని, కేసీఆర్‌, బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు శ్రీరామరక్ష అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షల తాపత్రయం రెండవ స్థానం కోసమేనని, సిట్టింగ్లకు సీట్లు ఇవ్వకుంటే మా దగ్గరికి వస్తారని ప్రతిపక్షాలు భావించాయన్నారు. తాను నిర్మించిన నాయకత్వం, పార్టీ నాయకులపైన తనకున్న నమ్మకం మేరకే కేసీఆర్ గారు సిట్టింగ్ స్థానాలకు సీట్లు ఇచ్చారని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 65 సంవత్సరాల లో ప్రతిపక్షాలు పెట్టిన మెడికల్ కాలేజీలు ,కేవలం రెండు మెడికల్ కాలేజీలే అని, కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు, నర్సింగ్ కాలేజీ ఇవ్వలేదు, నవోదయ పాఠశాల ఇవ్వలేదన్నారు మంత్రి కేటీఆర్‌.

Also Read : Nara Bhuvaneswari: చంద్రబాబుతో ఫ్యామిలీ మెంబర్స్‌ ములాఖత్.. భువనేశ్వరి ఎమోషనల్‌

ఇతర రాష్ట్రాల్లో ఉన్న అస్థిరత, నాయకత్వ లోపం తెలంగాణలో లేదని, మా ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ గారు, ప్రతిపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో వారికే తెలియదన్నారు మంత్రి కేటీఆర్‌. ఢిల్లీ నుంచి వచ్చి సీల్డ్ కవర్లు, వారికి అందించే మూటలు మాత్రమే ప్రతిపక్షాల పరిస్థితి అని, ముఖ్యమంత్రులను మార్చడానికి మత కల్లోలాలను లేపి మరణహోమం సృష్టించి, మనుషులను చంపిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన మండిపడ్డారు. తమ పార్టీ నాయకులపైననే చెప్పులు విసిరి పార్టీ కాంగ్రెస్ అని, తెలుగువారి గౌరవం పీవీ నరసింహారావు పైననే చెప్పులు విసిరిన ఘనత కాంగ్రెస్ ది అని ఆయన విమర్శలు గుప్పించారు.

Exit mobile version