Site icon NTV Telugu

Minister KTR : అడ్డమైన పార్టీకి ఓటు వేసి మోసపోకండి

Ktr

Ktr

పెద్దపల్లి జిల్లా నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి అనంతరం బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. మరోసారి మనోహర్ అన్న ను గెలిపించండన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కి పాటుపడిన వ్యక్తి దాసరి అని, మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మేమంతా ఒక్కటే… గెలిచిన తర్వాత బి ఆర్ ఎస్ లోకి వెళ్తా అన్న విజయ రమణ రావు మాటలు నమ్మకండని, అడ్డమైన పార్టీ కి ఓటు వేసి మోసపోకండి.ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ని అధిక మెజార్టీ తో గెలిపించుకోండని ఆయన అన్నారు.

Also Read : Nimmagadda Ramesh: ప్రజాస్వామ్యం బలహీనపడటానికి అంతర్గత శత్రువులే కారణం

అంతేకాకుండా.. ‘జిల్లా కేంద్రం చేసిన ఘనత కేసీఆర్ ది. ఇంటింటా మంచినీరు ఇస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి ఉంది. టేయిలెండ్ ప్రాంతాలకు సాగునీరు ఇచ్చిన ఘనత మాది.. ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ కి రెండు పంటలకు సాగునీరు అందించాం. 24 గంటలు విద్యుత్ అందిస్తున్నాం. కాంగ్రెస్ కు సవాల్ రాష్టం లో ని కాంగ్రెస్ వాళ్లకు పెద్దపల్లి నియోజకవర్గం లోని ఏ గ్రామానికి వెళ్లిన రేవంత్ రెడ్డి నుండి విజయ రమణ రావు వరకు కరెంట్ తీగలను పట్టుకోండి. 6 గ్యారెంటీ లు ఇచ్చారు.. 155 ఏండ్ల పార్టీ కి వారంటీ లేదు వాళ్లకు గ్యారెంటీ లేదు. మళ్ళీ పెద్దపల్లి అభివృద్ధి కి కడుపు నిండా 50 కోట్ల నిధులు కేటాయిస్తా. వెంటనే ప్రధాని తన మాటలను ఉపసంహారించుకోవాలి. తెలంగాణాలో ఇస్తున్నటుగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో రుణమాపీ చేయండి. బరాబర్ మాది కుటుంబ పాలనే. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కడు కేసీఆర్ కుటుంబమే అందుకే మాది కుటుంబ పాలన.’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Also Read : Shadab Khan: నా ఫామ్ ఇటీవల బాగా లేదు.. ప్రపంచ కప్లో బాగా ఆడతా

Exit mobile version