NTV Telugu Site icon

Minister KTR : నేటి నుంచి వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సు.. సిద్ధమైన తెలంగాణ పెవిలియన్‌

Davos 2023

Davos 2023

స్విట్జర్లాండ్‌లోనే దావోస్‌లో నేటి నుంచి వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సు ప్రారంభంకానుంది. అయితే.. ఈ సదస్సులో పాల్గొనడానికి తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తన బృందంతో ఆదివారం దావోస్‌ చేరుకున్నారు. ఆయనకు ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. అయితే.. నేటి నుంచి 20వ తేదీ వరకు ఈ సదస్సు జరుగనుంది. అయితే.. ఈ సదస్సులో కేటీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం పాల్గొననుంది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ సమావేశం అవుతారు. ఇప్పటికే తెలంగాణ పెవిలియన్‌ కంపెనీల ప్రతినిధులను ఆకర్షించేందుకు సిద్ధమైంది.

Also Read : Ajit Pawar: తృటిలో తప్పించుకున్నా.. లేకపోతే బ్రేకింగ్‌ న్యూస్‌ అయ్యేది..

డబ్ల్యూఈఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇండస్ట్రీ రౌండ్‌టేబుల్స్‌లో కూడా కేటీఆర్ పాల్గొంటారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి సంస్థలకు పెట్టుబడి గమ్యస్థానంగా ప్రదర్శించడం, ప్రైవేట్ రంగంలో యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో.. తెలంగాణ ప్రభుత్వ ప్రగతిశీల, పరిశ్రమ అనుకూల విధానాలను హైలైట్ చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించనున్నారు. తెలంగాణను అగ్రగామి టెక్నాలజీ పవర్‌హౌస్‌గా మార్చడంలో మీ నాయకత్వం ఎంతో కీలకమైందంటూ కేటీఆర్‌కు పంపిన ఆహ్వానంలో డబ్ల్యూఈఎఫ్‌ ప్రెసిడెంట్‌ బోర్గే బ్రెండే కొనియాడారు. ఇదిలా ఉంటే దావోస్‌కు తెలంగాణ ప్రతినిధుల బృందాన్ని పంపడం ఇది ఐదవసారి.