Site icon NTV Telugu

Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్‌ని పరామర్శించిన మంత్రి.. రూ.25 లక్షల చెక్ అందజేత

Komatireddy

Komatireddy

ఇక నుంచి బెనిఫిట్ షోలకు అనుమతులిచ్చేది లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సంధ్య థియేటర్ లో పుష్ప 2 బెనిఫిట్ షోకు అనుమతి లేకుండా.. హీరో వెళ్లడం కరెక్ట్ కాదన్నారు. ఆరోజు జరిగిన దుర్ఘటనపై అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. మృతురాలు రేవతి కుటుంబానికి తమ ఫౌండేషన్ నుంచి రూ. 25 లక్షలు ఇస్తామన్నారు. శ్రీతేజ ఆస్పత్రి ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

Read Also: Harish Rao: సీఎం అబద్ధాల్లో గిన్నిస్ బుక్‌ రికార్డులోకి ఎక్కుతారు..

మరోవైపు.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కిమ్స్ ఆస్పత్రికి వెళ్లవల్సిందిగా ఆదేశించారు. ఈ క్రమంలో.. ఆయన కిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో శ్రీ తేజ తీవ్రంగా గాయపడ్డాడు. అతను ఆరోజు నుంచి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం పిల్లాడి బ్రెయిన్ పని చేయడం లేదని డాక్టర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో.. కిమ్స్ ఆస్పత్రికి చేరుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. శ్రీతేజను పరామర్శించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కిమ్స్ ఆసుపత్రిలో శ్రీ తేజ ఆరోగ్యం పై మంత్రి ఆరా తీశారు. అనంతరం.. శ్రీ తేజ తండ్రికి రూ.25 లక్షల చెక్ ను మంత్రి అందించారు. ఈ క్రమంలో.. శ్రీతేజ కుటుంబానికి అన్ని రకాల సహాయం అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు.

Read Also: Allu Arjun: సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు.. కాసేపట్లో మీడియా ముందుకు అల్లు అర్జున్

ఇదిలా ఉంటే.. శ్రీతేజ్ హెల్త్‌ బులెటిన్‌ను కిమ్స్ వైద్యులు విడుదల చేశారు. శ్రీతేజ్ క్రమంగా కోలుకుంటున్నాడని.. వెంటిలేటర్ సాయం లేకుండా ఆక్సిజన్ తీసుకుంటున్నాడని వెల్లడించారు. అంతేాగాక.. శ్రీ తేజ్ ఫీడింగ్ కూడా సక్రమంగా తీసుకుంటున్నాడని తెలిపారు. శ్రీ తేజ్‌కు న్యూరాలజీ కండీషన్ స్థిరంగా ఉందని వైద్యులు చెప్పారు.

Exit mobile version