Site icon NTV Telugu

Komati Reddy Venkat Reddy: తన వాహనానికి తానే స్వయంగా జోడో యాత్ర పోస్టర్ అతికించుకున్న మంత్రి..

Komati Reddy

Komati Reddy

Komati Reddy Venkat Reddy: “న్యాయమైన హక్కును సాధించే వరకు” పోరాటం చేస్తామంటూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించిన రెండో విడత భారత్ జోడో యాత్ర ఈ నెల 14న మణిపూర్ లో ప్రారంభమై ముంబై వరకు సాగుతుందని రోడ్లు భవనాల శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

Read Also: Konda Surekha: నిత్య జీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నియంత్రించాలి..

కాగా.. ఈరోజు స్వయంగా రాహుల్ గాంధీ జోడో యాత్ర పోస్టర్ ను తన వాహనానికి అతికించిన మంత్రి.. రాహుల్ గాంధీ అనుచరునిగా, కాంగ్రెస్ పార్టీ జీవితకాల కార్యకర్తగా.. భారత్ జోడో యాత్రకు తన సంఘీభావాన్ని తెలుపుతానన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక సందేశం అందించేందుకు యాత్ర పోస్టర్ ను తానే స్వయంగా తన వాహనానికి అతికించుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా భారత్ జోడో యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

Read Also: Ram Mandir: అయోధ్య రామమందిర వేళ ఒక్కసారిగా కాషాయ జెండాలకు డిమాండ్..

Exit mobile version