NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: మూసి ప్రక్షాళనను అడ్డుకుంటే ప్రత్యేక ఉద్యమం చేస్తాం..

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy: మానవత్వం ఉన్న మనుషులైతే మూసీ ప్రక్షాళనకు మద్దతు ఇస్తారని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. మూసి నరకం నుంచి నల్గొండ జిల్లా ప్రజలకు విముక్తి కలుగుతుందన్నారు. మూసి పరివాహక ప్రాంతాల్లో పండే పంటలో ఐరన్ ఎక్కువ అని ప్రియాంకా వర్గీస్ స్టడీ రిపోర్ట్ ఇచ్చారన్నారు. ఓ వైపు ఫ్లోరిన్.. ఇంకో వైపు మూసి అంటూ మంత్రి తెలిపారు. నల్గొండ అంటే కేటీఆర్‌కు ఎందుకు అంత కోపమని ప్రశ్నించారు.మల్లన్న సాగర్ లో పోలీసులను పెట్టి రైతులను ఎందుకు ఖాళీ చేయించారని ప్రశ్నించారు. దమ్ముంటే మూసి మీద చర్చకు రావాలన్నారు. అసెంబ్లీ లో చర్చ పెడతామన్నారు. మూసీపై కేటీఆర్, హరీష్ రీసెర్చ్ చేయాలన్నారు. మూసీ ప్రక్షాళనలో ప్రజలను ఒప్పిస్తామని, వారికి సాయం చేస్తామన్నారు. బాధిత కుటుంబాలకు డబుల్‌బెడ్‌రూం ఇస్తామన్నారు.

Read Also: KTR: తులసీ నగర్‌లో మూసీ బాధితులతో మాట్లాడిన కేటీఆర్

ప్రధాని మోడీని మూసికి నిధులు అడిగామని.. ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. తాను మూసి కోసం 11 రోజులు దీక్ష చేశానన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వచ్చి మూసి తెలంగాణకు మరణ కారణం అయ్యిందని అన్నారన్నారు. కేసీఆర్, హరీష్, కేటీఆర్.. నల్గొండ మీద కక్ష కట్టారన్నారు. అన్నీ రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. మల్లన్న సాగర్‌లో 70 వేల ఎకరాలు ముంచారని.. 70 వేల కుటుంబాలను నీట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసి డీపీ కూడా ఇవ్వలేదు అంటే.. కూ.లక్ష 50 వేల కోట్లు పెడుతున్నారు అంటున్నారని మండిపడ్డారు. మూసి ప్రక్షాళనను అడ్డుకుంటే ప్రత్యేక ఉద్యమం చేస్తామన్నారు. ఎన్ని కోట్లు అయినా మూసి పూర్తి చేయాల్సిందేనన్నారు. రజాకార్లతో కొట్లాడినట్టు కొట్లాడుతామన్నారు.