అసెంబ్లీ సమావేశాలు అనంతరం నేరుగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజను మంత్రి పరామర్శించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కిమ్స్ ఆసుపత్రిలో శ్రీ తేజ ఆరోగ్యం పై మంత్రి ఆరా తీశారు. అనంతరం.. శ్రీ తేజ తండ్రికి రూ.25 లక్షల చెక్ ను మంత్రి అందించారు. ఈ క్రమంలో.. శ్రీతేజ కుటుంబానికి అన్ని రకాల సహాయం అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
Eatala Rajendar: చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి ఇద్దరు కేంద్రమంత్రులు..
తన సొంత ఖర్చులతో రేవతి పిల్లలిద్దరికీ చదువులు చెప్పిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈనెల 4న పుష్ప 2 బెనిఫిట్ షో కోసం సంధ్య థియేటర్‌కి రేవతి, భాస్కర్, వారి పిల్లలు శ్రీ తేజ, సాన్విక వెళ్ళారని అన్నారు. ఈ క్రమంలో హీరో అల్లు అర్జున్ బౌన్సర్లతో అక్కడికి వచ్చారు.. అక్కడే ఉన్న అన్ని థియేటర్లకు వచ్చిన సినిమా ప్రియులు కూడా హీరోని చూడటానికి వచ్చిన సమయంలో తొక్కిసలాట జరిగింది.. ఈ తొక్కిసలాటలో రేవతి చనిపోయింది.. కుమారుడు కోమాలోకి వెళ్ళాడు.. వెంటనే ఆస్పత్రికి తీసుకువచ్చినప్పటికి తల్లిని వైద్యులు బ్రతికించలేకపోయారని మంత్రి చెప్పారు. బాబు.. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు.. రేవతి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నానని అన్నారు. పేద ఆర్య వైశ్య కుటుంబంలో జన్మించిన వీరు.. ఇప్పటికే భాస్కర్ ఆరోగ్య సమస్యలతో ఉన్నారని మంత్రి తెలిపారు.
Ujjain: హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చర్చిపై రాతలు..
వద్దన్నా వచ్చి థియేటర్‌లో హడావుడి చేసిన హీరో మీద కేసు నమోదు అయ్యిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇంకా కామెంట్ చేయను.. అబ్బాయి ఆరోగ్యం చాలా విషమంగా ఉందన్నారు. మరోవైపు.. ప్రతీక్ ఫౌండేషన్ తరపున రేవతి కుటుంబానికి రూ. 25 లక్షలు చెక్ ఇచ్చానని చెప్పారు. ఆస్పత్రి వారికి కూడా చెప్పాము.. ఆ కుటుంబం నుంచి డబ్బులు ఒక్క పైసా కూడా తీసుకోవద్దని చెప్పానన్నారు. ఇక నుంచి నో బెనిఫిట్ షోస్.. ఏదేమైనా దేశ చరిత్రకు సంబంధించి, ఇంకేదైనా దేశం గురించిన సినిమా అయితే ఆలోచిస్తామని మంత్రి వెల్లడించారు. పుష్ప 2తో ఇంకా బెనిఫిట్ షోలు రద్దు అని చెప్పారు. తాను కూడా పుష్ప 2 చూసానని.. కానీ ఇక సినిమాలు చూడొద్దని డిసైడ్ అయ్యానన్నారు మంత్రి కోమటిరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం తరపున.. భాస్కర్ కుటుంబానికి సారీ చెబుతున్నామని చెప్పారు. భర్తకి పునర్జన్మ ఇచ్చి ఆమె వెళ్ళిపోయింది.. ఈ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా తానే చూసుకుంటానని వెల్లడించారు. సీఎం ఆదేశించారు.. ఆ అబ్బాయిని రక్షించుకోవడానికి ఎంత ఖర్చు అయినా తామే చూసుకుంటామన్నారు. శ్రీ తేజ పరిస్థితి చూస్తే భయం వేసింది.. రెండు మూడు రోజులు గడిస్తే చెప్పోవచ్చని చెప్పారు. మాటలు రావొచ్చు రాకపోవచ్చని వైద్యులు చెబుతున్నారని మంత్రి పేర్కొన్నారు.