AP అంటే A ఫర్ అమరావతి, P ఫర్ పోలవరం అనే విధంగా ప్రజలు ఆలోచిస్తున్నారని సమాచార పౌరసంబంధాల శాఖామంత్రి కొలుసు పార్ధసారథి అన్నారు. ఏపీని పెట్టుబడికి అనువైన ప్రాంతంగా పెట్టుబడిదారులు వస్తున్నారని తెలిపారు. రూ. 15 వేల కోట్లు కేంద్రంతో మంజూరు చేయించడం అమరావతి ప్రాజెక్టు పూర్తవుతుందనే నమ్మకం కలిగించిందని మంత్రి పేర్కొన్నారు. అమరావతి ఏర్పడుతుందా అనేది ఇప్పటివరకూ ఒక మిధ్య ఉండేదని అన్నారు. భారతమాల ప్రాజెక్టులో భాగంగా హైవేల అభివృద్ధితో భవిష్యత్తు బాగుపడనుంది.. అలాగే, అన్ని పాలసీలతో రూ. 30 లక్షల కోట్ల పెట్టుబడి, 20 లక్షల ఉద్యోగాల కల్పన ప్రయత్నం జరుగుతోందని మంత్రి తెలిపారు. మరోవైపు.. పెన్షన్, ఉచిత సిలిండర్లు, గత ప్రభుత్వం ఎగ్గొట్టినవి ఇవ్వడం ద్వారా సంక్షేమం చేయాలని సీఎం చంద్రబాబు ప్రణాళిక చేస్తున్నారని మంత్రి పార్ధసారథి అన్నారు.
Read Also: AP Govt: ఉచిత ఇసుక విధానాన్ని మరింత సరళం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..
మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి పార్ధసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఎం అంటూ జగన్ మాట్లాడుతూ ఆయన పరువు తీసుకునే పనులు చేస్తున్నారని అన్నారు. సొంత చెల్లి, తల్లికే అన్యాయం చేశాడని వాళ్లే చెపుతున్నారని తెలిపారు. ప్రభుత్వంపై బురద చల్లడమే ధ్యేయంగా మాట్లాడుతున్నారని మంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వ పరిపాలన వల్ల కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని ప్రజలు భరించారని అన్నారు. మరోవైపు.. హడ్కో చైర్మన్ ఇవాళ సీఎం చంద్రబాబును కలిశారు.. PMAY-2 ద్వారా ప్రతీ పేదవాడికి ఇళ్ళ విషయంలో ఎలాంటి నిబంధనలు లేకుండా బ్యాంకులు లోన్‌లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారని మంత్రి పార్థసారథి వెల్లడించారు.
Read Also: Putin Elon Musk: ఎలాన్ మస్క్, పుతిన్ మధ్య రహస్య సంబంధాలు.. వాల్ స్ట్రీట్ సంచలన కథనం..