NTV Telugu Site icon

Kishan Reddy : మొదటిగా ఈ జిల్లాల్లో డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు ప్రారంభించాం

Kishan Reddy

Kishan Reddy

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేడు డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్లను ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో మూడు డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించామని, మొదటగా ఖమ్మం, సిరిసిల్ల, జనగామలో ప్రారంభించామన్నారు. రానున్న రోజులలో అన్ని బ్యాంక్ లలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలను తీసుకువస్తామని, గతంలో ధనవంతులకే క్రెడిట్ కార్డు ఉండేది… ఇప్పుడు మాత్రం పేదలందరు క్రెడిట్ కార్డు వినియోగించుకుంటున్నారన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ కు చాలా ప్రాధాన్యత సంతరించుకుందని, రేషన్ కార్డులు మాఫీయాను అరికట్టి.. అర్హులైన పేదలకు రేషన్ కార్డులు అందించామన్నారు కిషన్‌ రెడ్డి. డ్యూప్లికేట్ ఎల్‌పీజీ అకౌంట్లకు చెక్ పెట్టేందుకు డిజిటల్ బ్యాంకింగ్ సహకారం అందించిందని, ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు బ్యాంకులో 300 కోట్లను డిజిటల్ పద్దతిలో అందిస్తామని ఆయన వెల్లడించారు.

Also Read : TS Group 1 Exam : 45 రోజుల పసిపాపతో గ్రూప్‌ 1 పరీక్షకు ఓ మహిళ.. తల్లి పరీక్ష రాస్తుంటే.. పాప ఆకలితో ఏడుస్తూ..

50 కోట్ల అకౌంట్లను జనధన్ అకౌంట్ కింద ఓపెన్ చేశామని, తెలంగాణలో జనధన్ అకౌంట్లు కొటి ఉన్నాయని, బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు. గతంలో ధనికులకే బ్యాంక్ లు ఉపయోగపడేది…ఇప్పుడు పేదలకు ఉపయోగపడుతుందని, కేంద్ర ప్రభుత్వంను విమర్శించినవారే.. ఇప్పుడు అభినందిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. డిజిటల్ బ్యాంకింగ్ సేవలేకాదు.. విద్యాభోదను కూడా డిజిటల్ రంగంలోకీ తీసుకువస్తామన్న కిషన్‌ రెడ్డి.. డిజిటల్ పై అవగాహన లేని వారికి డిజిటల్ రంగంలో శిక్షణ ఇస్తామన్నారు. ఇండియాలో డిజిటల్ విప్లవం వస్తుందని ఆయన అన్నారు.

Show comments