రాజకీయం అంటూ ఏంటీ అని చంద్రబాబు, లోకేష్ లపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకు, ప్రాంతాలకు, కులాలకు అతీతంగా రాష్ట్రంలోని అందరికి అన్నీ అందిస్తున్నామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీల కార్యకర్తలు ఏ ఇంటికైనా వెళ్ళగలుగుతున్నారా.. ఆ పార్టీల కార్యకర్తలు ప్రజలను ఓటు అడిగే పరిస్ధితిలో లేరు అని ఆయన పేర్కొన్నారు. అన్ని పార్టీలను కలిసి రమ్మనండి.. విడి విడిగా రమ్మనండి… సింహం సింగిల్ గా వస్తుంది.. చంద్రబాబు ముసలి నక్కలాగా తరమండ్రా నాకొడకల్ని అనటం రౌడీయిజం కాదా అని మంత్రి కారుమూరి అన్నారు.
Read Also: SSC Sub Inspector Recruitment : డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు భర్తీ.. కొద్ది రోజులు మాత్రమే..
పుంగనూరులో పోలీసులకు నేను చేతులెత్తి దణ్ణం పెడతానని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. నిన్న ఉమా పారిపోవాల్సిన పరిస్ధితి ఏంటి.. దొంగల ముఠా నాయకులు వాళ్ళు.. చంద్రబాబు దుర్మార్గం అతన్ని వెంటాడుతుంది.. ఇంకా మేకప్పులు కోటింగ్ లు చేసుకోవాలి చంద్రబాబు.. చంద్రబాబు ఛాప్టర్ క్లోజ్.. ఆఫీసు మూసుకోవాల్సిందేనని మంత్రి కారుమూరి విమర్శించారు.
Read Also: Minister Errabelli: ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి..
పోలీసుల మీద దాడి చేస్తే ఊరుకుంటారా.. లా అండ్ ఆర్డర్ కాపాడరా.. తాడు పాము తెలీని పప్పు లోకేష్ కార్యకర్తలను కేసులు పెట్టించుకోమంటాడా అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. సినిమా యాక్టర్లు రాజకీయాలలోకి రావచ్చు.. అన్నీ కలిపి రకరకాలుగా మాట్లాడితే ఇంకా మాట్లాడాల్సి వస్తుంది.. రాజకీయం రాజకీయమే.. సినిమా సినిమానే అని మంత్రి చెప్పుకొచ్చారు. సినిమా వాళ్లు రాజకీయాల గురించి ఇష్టం వచ్చినట్లు మంచిది కాదు అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.
