Site icon NTV Telugu

Karumuri Nageswara Rao: ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై తప్పుడు ప్రచారం.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..

Karumuri On Cbn

Karumuri On Cbn

Karumuri Nageswara Rao: ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సూచనలలతో తీసుకొచ్చిన మోడల్ యాక్ట్ పై అభిప్రాయ సేకరణ మాత్రమే జరుగుతుంది.. ఈ యాక్ట్ అమలు విషయం ఇంకా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. సినీ నటులతో ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ప్రజల ఆస్తులను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం కాజేసే ప్రయత్నం చేస్తున్నట్లు చేస్తున్న ప్రచారంపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇక, తప్పడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. కేంద్రం అమలు చేసే యాక్ట్ పై కూటమిలో ఉన్న టీడీపీ-జనసేన నేతలు.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సలహా ఇచ్చారు. ఇక, అబద్దాలను ప్రజలకు చెప్పడంలో చంద్రబాబు దిట్టా అంటూ దుయ్యబట్టారు. తణుకు టీడీపీ అభ్యర్థి కూడా సోషల్ మీడియాలో దుర్మర్గమైన రితిలో వ్యవహరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు.. దున్నపోతూ ఈనీంది అంటే దూడను కట్టేయండి అన్నవిధంగా చంద్రబాబు, అరిమిల్లి రాధాకృష్ణ వ్యవహరిస్తూన్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..

Read Also: Tamannaah : “కన్నప్ప”లో స్పెషల్ సాంగ్ చేయనున్న మిల్కీ బ్యూటీ..?

Exit mobile version