Karumuri Nageswara Rao: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై మరోసారి చర్చ సాగుతోంది.. విశాఖలోనే కాపురం పెడతా.. అక్కడి నుంచి పాలన సాగిస్తామంటూ వైఎస్ జగన్ ప్రకటించిన తర్వాత.. విపక్షాలు దానిపై కౌంటర్ ఎటాక్ చేశాయి.. అయితే, ఆ వ్యాఖ్యలు తిప్పుకొడుతూనే.. రాజధాని వైజాగే అని స్పష్టం చేస్తోంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అక్కడి నుండే పాలన సాగనుంది అన్నారు.. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నిన్న చంద్రబాబు చేసుకున్నది 420 బర్త్ డే.. మళ్ళీ పేదలను మోసం చేసే కార్యక్రమం చేపట్టారు.. తానే ఇంద్రుడు, చంద్రుడు అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.. ఆయన ప్రజల్లో నుండి వచ్చిన వ్యక్తి కాదు.. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి, పార్టీ, బ్యాంకు బ్యాలెన్స్ లాక్కుని అధికారంలోకి వచ్చారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో బాబొస్తే జాబు వస్తుందని రాశారు.. బాబు వచ్చాడు, కానీ జాబ్ రాలేదన్న ఆయన.. నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారు, రైతులకు రుణమాఫీ, మహిళలకు డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి మోసం చేశారు.. ఈ మోసం చేయటం ఏంటని అడిగితే విలేకర్లపై ఆగ్రహం చేశారని దుయ్యబట్టారు.
Read Also: DSC notification: గుడ్‌న్యూస్.. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్..!
కానీ, వైఎస్ జగన్ పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశారు.. అందుకే చెప్పినవన్నీ చేశారని తెలిపారు కారుమూరి.. డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే డబ్బు పడేలా చేస్తున్నారు … కరోనా వచ్చినా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు. ఇంగ్లీషు మీడియం స్కూల్స్ తెస్తే చంద్రబాబు అడ్డుకున్నారు.. అలాంటి నయవంచకుడు మరో కపట నాటకానికి రెడీ అయ్యారని మండిపడ్డారు. తల్లికి తలకొరివి కూడా పెట్టని వ్యక్తి చంద్రబాబు.. తోడబుట్టినవాడిని గదిలో బంధించిన వ్యక్తి ఆయన.. చంద్రబాబు సైకో, శాడిస్టు అంటూ ఫైర్ అయ్యారు.. చంద్రబాబు అక్రమాలు బయటకు వస్తున్నాయి.. త్వరలోనే చంద్రబాబు జైలుకు వెళ్లటం ఖాయమని జోస్యం చెప్పారు. దేశమంతా రోడ్లు వేశాననీ, అరటిపండుని కూడా తానే కనిపెట్టానని మాట్లాడుతుంటే జనం నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు చంద్రబాబును చీదరించుకుంటున్నారు.. మైకు కూడా పట్టుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారన్న ఆయన.. అలాంటి వ్యక్తిని జనం ఇంటికి పంపించే రోజులు వచ్చాయన్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తలకు కూడా మా పాలనలో సంక్షేమం అందింది.. అందుకే వారు కూడా జగన్ ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.. ఇక, వైజాగ్ నుండి పాలన ఖాయం.. సెప్టెంబర్‌లో విశాఖకు వెళ్లటం ఖాయం.. రాజధాని వైజాగే.. అక్కడి నుండే పాలన అని స్పష్టం చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.